- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైద్య విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఫేక్ ఓఎంఆర్ షీట్లపై NTA స్ట్రాంగ్ వార్నింగ్
నీట్ (యూజీ) వైద్య విద్యార్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: వైద్య విద్యార్థులు, తల్లిదండ్రులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) మరోసారి సంచలన హెచ్చరికలు జారీ చేసింది. తాజాగా విడుదల చేసిన రీ-ఎగ్జామ్ రిజల్ట్స్, మార్కులపై వస్తున్న ఫిర్యాదులను తాము నిశితంగా పరిశీలిస్తున్నామని ఎన్‌టీఏ స్పష్టం చేసింది. అయితే, రీ-వెరిఫికేషన్ కోసం అభ్యర్థులు సమర్పిస్తున్న ఓఎంఆర్ (OMR) షీట్లలో చాలావరకు ఫేక్, ఏఐతో తయారు చేసిన ఓఎంఆర్ షీట్లు అని తేలడం సంచలనం రేపుతోంది. అయితే, ఈ అంశంపై ఎన్‌టీఏ అధికారికంగా ‘X’ ట్వీట్ చేసింది. ‘విద్యార్థుల నుంచి వస్తున్న ప్రతి ఫిర్యాదును ఎన్‌టీఏ అత్యంత నిశితంగా పరిశీలిస్తోందని తెలిపింది. రీ-వెరిఫికేషన్ కోసం సమర్పించిన అనేక ఓఎంఆర్ షీట్లు నకిలీవని, ఏఐ (AI) ద్వారా సృష్టించబడినవని తేలింది. కాబట్టి విద్యార్థులు, తల్లిదండ్రులు స్క్రూటినీ కోసం కేవలం ఒరిజినల్ ఓఎంఆర్ షీట్లను మాత్రమే సమర్పించాలని సూచిస్తున్నాం. ఎవరైనా తప్పుడు లేదా ఏఐ ద్వారా సృష్టించిన నకిలీ ఓఎంఆర్ షీట్లను సమర్పిస్తే, సదరు ఫిర్యాదుదారులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’ అని ఎన్‌టీఏ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.
అయితే, కొందరు తమకు వచ్చిన మార్కులను మార్చేందుకు టెక్నాలజీ వాడుతూ ఫేక్ ఓఎంఆర్ షీట్లతో రీ-వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేస్తున్నట్లుగా ఎన్‌టీఏ గుర్తించింది. ఈ నేపథ్యంలో విద్యార్థులెవరూ అలాంటి చర్యలకు పాల్పడవద్దని, కేవలం అఫీషియల్ రికార్డ్స్ మాత్రమే నమ్మాలని స్పష్టం అధికారులు చేశారు.






