TG: షాకింగ్ రూల్.. చలాన్ పడిన వెంటనే అకౌంట్ నుంచి డబ్బుల్ కట్: సీఎం రేవంత్ రెడ్డి

by Prasad Jukanti |   (  Updated:2026-01-13 09:06:05  IST  )

ఇకపై ట్రాఫిక్ చలాన్ల డిస్కౌంట్లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

TG: షాకింగ్ రూల్.. చలాన్ పడిన వెంటనే అకౌంట్ నుంచి డబ్బుల్ కట్:  సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో : దేశంలో ప్రతి నిమిషం ఓ రోడ్డు ప్రమాదం జరుగుతుంటే.. ప్రతి 3 నిమిషాలకు ఒకరు మరణిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వడం, డ్రంగ్ అండ్ డ్రైవ్ వల్లే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు. ఇలాంటివారిపై కఠినంగా వ్యవహరించి నివారించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. హైదరాబాద్ యూసుఫ్‌గూడ స్టేడియంలో రోడ్డు ప్రమాదాలు తగ్గించాలనే లక్ష్యంతో చేపట్టిన ‘అరైవ్‌ అలైవ్‌’ కార్యక్రమంలో సీఎం పాల్గొని మాట్లాడారు. వాహనాల స్పీడ్ ఆధారంగా చలాన్లు విధిస్తున్నా డిస్కౌంట్ ఇచ్చి ఎలాగూ తగ్గిస్తారనే ఆలోచన ఓ పెద్ద సమస్యగా మారిందన్నారు.అందువల్ల ఇకపై ట్రాఫిక్ చలాన్లపై ఎలాంటి డిస్కౌంట్లు ఇవ్వొద్దని సూచించారు. ఏ వాహనమైనా ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే యజమాని బ్యాంకు ఖాతా నుంచి ఆటోమెటిక్‌గా డబ్బులు కట్ అయ్యేలా విధానం ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకోసం వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలోనే యజమాని బ్యాంకు ఖాతాకు లింక్ చేయాలని సూచించారు. ఈ విషయంలో బ్యాంకర్లతో సమన్వయం చేసుకోవాలన్నారు. మైనర్లు ప్రమాదాలకు కారకులైతే వారి తల్లిదండ్రులపై కేసులు పెట్టాలన్నారు.

సమన్వయంతో పని చేయాలి..

రోడ్డు ప్రమాదాల విషయంలో రవాణా శాఖ, పోలీస్ శాఖ సమన్వయంతో పని చేయాలని సీఎం సూచించారు. చాలా సందర్బాల్లో మనకు సంబంధం లేకపోయినా ఎదుటివారి తప్పు వల్ల మనకు ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో రోడ్డు సేప్టీ అథారిటీకి అడిషనల్ డీజీ పోస్ట్ ఉందని, కానీ ఈ పోస్ట్‌కు బదిలీ చేయగానే అదొక పనిష్మెంట్‌గా భావిస్తున్నారని పేర్కొన్నారు. కానీ ఇకపై దీన్ని కూడా సవరిస్తామన్నారు. ఇకపై రోడ్డు సేప్టీ, ట్రాఫిక్ విషయంలో డీజీ, అడిషనల్ డీజీ క్యాడర్‌ను నియమిస్తామని సీఎం తెలిపారు.

నూతన చట్టం అవసరం..

హైడ్రా, ఈగల్, సైబర్ క్రైమ్‌ విభాగాలను బలోపేతం చేసినట్టే ట్రాఫిక్ నియంత్రలోనూ పోలీస్ వ్యవస్థను సిద్ధం చేయాల్సి ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రమాదం ఉండేదని, కానీ ఇప్పుడు మర్డర్ కంటే రోడ్డు ప్రమాదాలు డేంజర్‌గా మారాయని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాద మరణాలు మనుషులు చేస్తున్న తప్పిదాల వల్ల జరుగుతున్న హత్యలుగానే భావించాలన్నారు. ప్రస్తుతం ఉన్న రవాణా విధివిధానాలను ప్రక్షాళన చేసి నూతన చట్టం తీచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ చట్టంపై పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు నేర్పించాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు.

Read More... ఉద్యోగులకు ప్రభుత్వం డీఏ.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

ట్రాఫిక్ చలాన్లపై కాదు కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలకు ఆటో డిడక్షన్ పెట్టండి: బండి సంజయ్

ట్రాఫిక్ చలాన్లపై రేవంత్ సర్కార్ నిర్ణయంపై బీజేపీ ఫైర్

Next Story