- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్రాఫిక్ చలాన్లపై రేవంత్ సర్కార్ నిర్ణయంపై బీజేపీ ఫైర్
ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారి బ్యాంకు ఖాతాల నుంచి నేరుగా జరిమానా డబ్బులను కట్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన రాజకీయ దుమారం రేపుతోంది.

దిశ, వెబ్ డెస్క్: ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారి బ్యాంకు ఖాతాల నుంచి నేరుగా జరిమానా డబ్బులను కట్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రకటన రాజకీయ దుమారం రేపుతోంది. సీఎం ప్రకటనపై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే రాజకీయ పార్టీలు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు (Ramchandra Rao) ట్రాఫిక్ చలాన్ల నిర్ణయంపై (decision on traffic challans) స్పందించారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ట్రాఫిక్ నిబంధనల అమలుకు తాము వ్యతిరేకం కాదని, కానీ జరిమానాల వసూలు కోసం ప్రజల బ్యాంకు ఖాతాలను ఆర్టీయే (RTA) వ్యవస్థతో అనుసంధానించడాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు.
ఈ విధానం వల్ల సామాన్యుల బ్యాంకు ఖాతాల వివరాలు, వారి ఆర్థిక గోప్యత (Privacy) ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని ఆయన ఎండగట్టారు. గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'సంచార్ సాథీ' (Sanchar Saathi) యాప్ వల్ల ప్రజల ప్రైవసీకి ముప్పు ఉందని నాడు కాంగ్రెస్ పార్టీ గగ్గోలు పెట్టిందని గుర్తుచేశారు. ఇప్పుడు అదే పార్టీ అధికారంలో ఉండి, ఏకంగా ప్రజల బ్యాంకు ఖాతాల్లోకి చొరబడి డబ్బులు కట్ చేసేలా నిర్ణయాలు తీసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తాజా ప్రకటనతో కాంగ్రెస్ పార్టీ కపటబుద్ధి (Hypocrisy) బయటపడిందని రాంచందర్ రావు ధ్వజమెత్తారు.
Read More... ట్రాఫిక్ చలాన్లపై కాదు కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలకు ఆటో డిడక్షన్ పెట్టండి: బండి సంజయ్
TG: షాకింగ్ రూల్.. చలాన్ పడిన వెంటనే అకౌంట్ నుంచి డబ్బుల్ కట్: సీఎం రేవంత్ రెడ్డి






