- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అటవీ భూమిని అక్రమంగా దున్నుతుండగా రెండు ట్రాక్టర్లు సీజ్
మండలంలోని గౌరారం గ్రామ సెక్షన్ పరిధిలోని మేడిపల్లి తండా శివారులో అటవీ భూమిని అక్రమంగా చదును చేస్తున్న రెండు ట్రాక్టర్లను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

దిశ, గాంధారి : మండలంలోని గౌరారం గ్రామ సెక్షన్ పరిధిలోని మేడిపల్లి తండా శివారులో అటవీ భూమిని అక్రమంగా చదును చేస్తున్న రెండు ట్రాక్టర్లను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గాంధారి అటవీశాఖ అధికారి రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. అటవీ ప్రాంతాన్ని అక్రమంగా దున్నుతున్నారనే సమాచారం అందడంతో సోమవారం అధికారులు మేడిపల్లి తండా శివారుకు చేరుకున్నారు. అక్కడ అటవీ భూమిని చదును చేస్తున్న ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకుని గాంధారి అటవీ కార్యాలయానికి తరలించారు. అలాగే ఆదివారం రాత్రి కూడా అదే తండా పరిధిలో మరో ట్రాక్టర్‌ను పట్టుకుని రెండు వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు.
అనంతరం మండలంలోని లొంక తండాలో సర్పంచ్ రవీందర్ ఆధ్వర్యంలో తండావాసులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీ అధికారి రమేష్ మాట్లాడుతూ.. అటవీ సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, అడవులు పరిరక్షితంగా ఉంటేనే భావితరాల మనుగడ సాధ్యమవుతుందని అన్నారు. అటవీ హక్కుల చట్టం కింద పట్టాలు పొందిన గిరిజన రైతులు తమకు కేటాయించిన భూముల హద్దుల్లోనే సాగు చేయాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా అటవీ ప్రాంతాన్ని ఆక్రమించడం, చెట్లను నరికివేయడం వంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సెక్షన్ అధికారులు ప్రతిభ, సలీం, అహ్మద్, బీట్ అధికారులు వినోద్, ప్రకాష్, శ్రీకాంత్, నవీన్‌తో పాటు బేస్ క్యాంపు సిబ్బంది పాల్గొన్నారు.






