600 వాహనాల భారీ కాన్వాయ్‌తో మహారాష్ట్రకు కేసీఆర్

by GSrikanth |
600 వాహనాల భారీ కాన్వాయ్‌తో మహారాష్ట్రకు కేసీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు, రేపు రెండు రోజుల పాటు మహారాష్ట్రలో ఆయన పర్యటించనున్నారు. కాసేపట్లో ప్రగతి భవన్ నుంచి 600 వాహనాల భారీ కాన్వాయ్‌తో ఆయన మహారాష్ట్రకు బయల్దేరారు. దాదాపు 2 వేల మంది నేతలు కేసీఆర్‌తో పాటు వెళ్తున్నట్లు సమచారం. రోడ్డు మార్గం గుండా వీరి ప్రయాణం 300 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీ నేతలను ఆకర్షించడంపై కేసీఆర్ దృష్టి సారించనున్నట్టు తెలుస్తోంది. కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను మాజీ ఎంపీ వేణుగోపాలాచారి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌లు మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలతో సమన్వయం చేసుకుని చేస్తున్నారు. సీఎం వెంట పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు.

Read more: 500 కార్లతో ప్రజాధనం వృధా: కేసీఆర్ మహారాష్ట్ర టూర్‌పై కేఏ పాల్ ఫైర్

Next Story

Most Viewed