అక్కినేని నాగార్జున రంభను అలా చేయడం వల్లనే కోపం.. అందుకే ఎన్ని ఆఫర్లు వచ్చినా నటించలేదా?

by Kavitha |
అక్కినేని నాగార్జున రంభను అలా చేయడం వల్లనే కోపం.. అందుకే ఎన్ని ఆఫర్లు వచ్చినా నటించలేదా?
X

దిశ, సినిమా: ‘ఆ ఒక్కటి అడక్కు’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రంభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన మొదటి మూవీతోనే మంచి విజయం అందుకున్న వరుస సినిమాలతో దూసుకుపోయింది. కానీ పెళ్లి చేసుకున్నాక అడపాదడపా సినిమాల్లో కనిపించిన రంభ ప్రజెంట్ పూర్తిగా కుటుంబానికే పరిమితమైంది. సోషల్ మీడియాలో బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మకి అన్ని కలిసి వస్తే మళ్లీ రీ ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.ఇదిలా ఉండగా ఇప్పుడు ఈమెకి సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది.బ్యూటీ రంభ.. ఒక చిన్న గొడవ కారణంగా అక్కినేని నాగార్జునతో ఒక్క సినిమా కూడా చేయలేదట. అప్పట్లో నాగ్ తో నటించడానికి హీరోయిన్స్ క్యూ కట్టేవారు. కానీ, ఎన్నోసార్లు నాగ్ తో నటించే అవకాశం వచ్చినా కూడా రంభ మాత్రం నో చెప్పిందట. తెలుగు, హిందీ , తమిళం మరియు మలయాళం భాషల్లో అందరి హీరోలతో నటించిన రంభ.. నాగ్ కు ఓ చెప్పడానికి కారణం.. ఒక చిన్న సంఘటన అని చెప్పుకొస్తున్నారు.

అదేటంటే.. నాగార్జున కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాల్లో హలో బ్రదర్ ఒకటి. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాగ్ డబుల్ రోల్ లో నటించగా.. రమ్యకృష్ణ, సౌందర్య హీరోయిన్స్ గా నటించారు. అయితే రమ్యకృష్ణ కంటే ముందుగా ఆ పాత్ర కోసం రంభని అనుకున్నాడట డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ. ఆమెతో మాట్లాడి డేట్స్ కూడా ఫైనల్ చేశారట. కానీ, నాగ్ మాత్రం తనకు రమ్యకృష్ణనే కావాలని పట్టుబట్టడంతో హీరో మాటే వేదం అనుకొనే మేకర్స్ తప్పనిసరి పరిస్థితుల్లో రంభని తప్పించి రమ్యకృష్ణను తీసుకున్నారట. ఇక ఈ సినిమా ఏ రేంజ్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇక నాగ్.. తనను రిజెక్ట్ చేశాడని తెలుసుకున్న రంభ.. ఆయనపై కోపం పెంచుకుందట. ఆ తర్వాత నాగ్ పక్కన నటించే అవకాశం వచ్చినా.. తనను రిజెక్ట్ చేసిన హీరోతో చేయనని తెగేసి చెప్పేసిందంట. అందుకే ఇప్పటివరకు కూడా నాగ్ తో రంభ స్క్రీన్ షేర్ చేసుకోలేదు. అయితే డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ కోరిక మేరకు అదే సినిమాలో ఒక పాటలో మాత్రం అలా మెరిసి ఇలా వెళ్ళిపోయింది. అదే కన్నెపెట్టరో కన్నుకొట్టరో సాంగ్. ఇందులో రంభ, ఆమని, ఇంద్రజ నాగార్జునతో పాటు స్టెప్స్ వేశారు. అది కూడా తనకు లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ మాట కాదనలేక చేసినట్లు ఆ తర్వాత రంభ చెప్పిందట.Next Story

Most Viewed