ఒకేరోజు నాలుగు పరీక్షలు.. నిరుద్యోగులను టెన్షన్ పెట్టిస్తోన్న ''ఫిబ్రవరి 26''

by Disha Web Desk 19 |
ఒకేరోజు నాలుగు పరీక్షలు.. నిరుద్యోగులను టెన్షన్ పెట్టిస్తోన్న ఫిబ్రవరి 26
X

దిశ, తెలంగాణ బ్యూరో: డివిజనల్ అకౌండ్ ఆఫీసర్(డీఏవో) పరీక్షలను వాయిదా వేయాలని నిరుద్యోగ అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. ఒకేరోజు నాలుగు పరీక్షలు ఉన్న నేపథ్యంలో నిరుద్యోగులకు ఇబ్బందిగా మారిందని, ఒక పరీక్ష రాస్తే.. మరో పరీక్షను వదులుకోవాల్సి వస్తుండటంతో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఇప్పటికే పలువురు అభ్యర్థులు టీఎస్ పీఎస్సీ అధికారులకు పలుమార్లు విన్నవించారు. పరీక్ష తేదీని మార్చాలని డిమాండ్ చేశారు. అయినా అధికారులు మార్పుపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో అధ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

ఈ నెల 26వ తేదీన డీఏవో పరీక్ష నిర్వహిస్తుండగా.. అదే రోజు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్(జేఈ), కేంద్రీయ విద్యాలయ సంఘటన్(పీఆర్ టీ) తో పాటుగా ఎయిర్ పోర్ట్‌లో ఖాళీల భర్తీకి సైతం అదే రోజు పరీక్ష నిర్వహిస్తున్నారన్నారు. దీంతో ఇతర పరీక్షలు రాసేవారికి తీవ్ర నష్టం జరగనుంది. కాగా, నిరుద్యోగ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా బుధవారం తీర్పు వెలువడే అవకాశమున్నట్లుగా వారు తెలిపారు. తమకు న్యాయం జరుగుందనే ఆశాభావంతో అభ్యర్తులు ఉన్నారు. మరోసారి ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు జాగ్రత్త తీసుకోవాలని కోరుతున్నారు.

Next Story

Most Viewed