నవదంపతులకు తలనొప్పిగా మారిన సంతానలేమి.. ఇలా ఎందుకు అవుతోంది?

by Jakkula Samataha |
నవదంపతులకు తలనొప్పిగా మారిన సంతానలేమి.. ఇలా ఎందుకు అవుతోంది?
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం చాలా మంది నవ దంపతులు సంతాన సమస్యలు ఎదుర్కొంటున్నారు. పెళ్లై రెండు సంవత్సరాలు అవుతుంది, ఇంకా పెళ్లి కావడం లేదనే బాధ చాలా మందిని కుంగదీస్తుంది. ఇక పెళ్లైన ఆరు నెలల నుంచి మొదలు పెడుతుంటారు మన ఇరుగు పొరుగు వారు.. ‘‘పెళ్లి అయ్యింది కానీ.. ఇంకా పిల్లలు లేరు’’ అంటూ వారు కపుల్స్ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోకుండా వారిని మానసికంగా ఇబ్బంది పెడుతారు. అయితే ఈ సమస్య ఎందుకు పెరిగిపోతుందో ఇప్పుడు చూద్దాం. తాజా నివేదిక ప్రకారం.. ముఖ్యంగా భారత దేశంలో సంతానలేమి సమస్య అనేది విపరీతంగా పెరిగిపోతుందంట. .ప్రస్తుతం మన దేశంలోని గణాంకాల ప్రకారం 27.5 మిలియన్ల జంటలు సంతానలేమితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. పునరుత్పత్తి సమస్యలు భార్యాభర్తలూ ఇద్దరినీ సమానంగా వేధిస్తున్నాయి. కనీసం 10-15 శాతం మంది వివాహిత జంటలు సంతానోత్పత్తి సమస్యలను ఎదుర్కొంటున్నట్లు సర్వేలో తేలింది. ఆడవారిలో హార్మోన్ల అసమతుల్యత అండాన్ని విడుదల కాకుండా అండ్డుకుంటే మగవారిలో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండటం.. కణాలలో కదలిక లేకపోవడం వలన సంతానలేమి సమస్య వస్తుంది.

అయితే అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ పూర్తి ఆరోగ్యంగా ఉన్నప్పుడే సంతానం త్వరగా కలుగుతుంది. కానీ కొంత మంది ఇప్పుడే పెళ్లి అప్పుడే పిల్లలా అనే విధంగా ఆలోచిస్తున్నారు. దాని వలన కూడా సంతానలేమి సమస్యలు వస్తున్నాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా గర్భాధారణ ఆలస్యం చేసే వారిలో 54 శాతం మంది సంతాన సమస్యలు ఎదుర్కొంటున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అందుకే సరైన సమయంలోనే పిల్లల కోసం ప్లాన్ చేసుకోవాలి.

ఒక వేళ మీరు పూర్తి ఆరోగ్యంగా ఉండి.. పిల్లల కోసం ఎంత ట్రై చేసినా ప్రెగ్నెన్సీ అనేది రాకపోతే వెంటనే వైద్యుడిని సంప్రదించి పలు టెస్ట్‌లు చేసుకోవడం ఉత్తమం. లేకపోతే ఆ సమస్య పెద్దదిగా మారి చాలా సమస్యలు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు కలగక పోవడం అనేది భార్య అనారోగ్య సమస్యల వలన 40%, భర్తల్లో 40% అనారోగ్య సమస్యల వలన పిల్లలు కలగడం లేదంట. గర్భం ధరించాలి అంటే నవ దంపతులు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కపుల్స్ మంచి పోషకాహారం ఉన్న ఫుడ్ తీసుకోవాలి. తాజా పండ్లు తీసుకోవాలి. ముఖ్యంగా మగవారు ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి. దీని వలన త్వరగా పిల్లలు పుట్టే ఛాన్స్ ఉంటుంది. కాబట్టీ ఆరోగ్యం విషయంలోజాగ్రత్తలు తీసుకొని మంచి బిడ్డకు జన్మనివ్వండి.



Next Story

Most Viewed