చెరువులో ముగ్గురు ట్రాన్స్‌జెండర్ల మృతదేహాలు.. కర్నూలులో కలకలం

by srinivas |
చెరువులో ముగ్గురు ట్రాన్స్‌జెండర్ల మృతదేహాలు.. కర్నూలులో కలకలం
X

దిశ, వెబ్ డెస్క్: కర్నూలు గార్గేయపురంలో ముగ్గురు ట్రాన్స్‌జెండర్ల మృతి కలకలం రేగింది. స్థానిక చెరువులో వీరి మృతదేహాలు లభించాయి. తొలుత రెండు మృతదేహాలు చెరువులో తేలియాడుతుండటాన్ని స్థానికులు గమనించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు ఇద్దరు ట్రాన్స్ జెండర్లు బయటకు తీస్తుండగా మరో మృతదేహం కనిపించింది. దీంతో ముగ్గురిగా గుర్తించారు. మృతదేహాలపై ఒక్క గాయం కూడా లేకపోవడంతో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.

మృతదేహాలు గుర్తు పట్టేలాగే ఉన్నాయి. కానీ ఈ ముగ్గురు ట్రాన్స్ జెండర్లు ఎవరనేది సస్పెన్స్‌గా మారింది. ‘ట్రాన్స్‌జెండర్లు ఎవరు?.. ఎక్కడి నుంచి వచ్చారు?. ఎందుకు మృతి చెందారు?. చనిపోయారా.. ? ఆత్మహత్య చేసుకున్నారా..?. ఎవరైనా చంపి తీసుకొచ్చి చెరువులో పడేశారా, క్షుద్ర పూజల నేపథ్యంలో ఇలాంటి ఘాతుకానికి పాల్పడ్డారా..?.’ అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు ఈ మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఇతర ప్రాంతాల నుంచి ట్రాన్స్ జెండర్లను పలిపించి గుర్తు పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే కేసు మిస్టరీని ఛేదిస్తామని చెబుతున్నారు. ట్రాన్స్ జెండర్ల ఫొటోలను స్థానికంగా వైరల్ చేశారు. గుర్తు పడితే తమకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

Next Story