డ్రామ బాజ్ డాగీ.. దాని నటనకు ఆస్కార్ కూడా తక్కువే..

by Sumithra |
డ్రామ బాజ్ డాగీ.. దాని నటనకు ఆస్కార్ కూడా తక్కువే..
X

దిశ, ఫీచర్స్ : అత్యంత తెలివితేటలు, విధేయత గురించి మాట్లాడినప్పుడల్లా మొదట గుర్తుకు వచ్చే పేరు కుక్కలది. అలాగే ఇది నటన కూడా మనుషుల మాదిరిగానే నటించగలవు. ఇప్పుడు బయటపడిన ఈ వీడియోను చూడండి, ఇక్కడ ఒక కుక్క అలాంటి పనే చేసింది. ఈ కుక్క నటనను చూస్తే మెచ్చుకోని వారుండరు. అలాగే కొంతమంది తిట్టుకోవచ్చు, మరికొంతమంది నవ్వు ఆపుకోలేక పోవచ్చు. ఇంతకీ ఆ కుక్క ఏం చేసిందో ఇప్పుడు చూద్దాం.

సినిమాల్లో నటించే చాలా మంది సినిమా ఆర్టిస్టులను చూసి ఉంటారు. అందుకు వారికి వివిధ రకాల అవార్డులు అందజేస్తారు. అయితే కుక్క నటించడం ఎప్పుడైనా చూశారా ? కాకపోతే ఓ కుక్క ఇంత అద్భుతంగా నటించిందో ఈ వీడియో చూడండి. ఇది చూసిన తర్వాత, ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న పెద్ద నటులు కూడా దీని యాక్టింగ్ ముందు దిగదుడుపే అంటారు.

ఓ కుక్క రోడ్డుపై అందరికీ జాలి కలిగేలా నడుచుకుంటూ వెళుతుండడాన్ని వీడియోలో చూడొచ్చు. దాన్ని చూస్తుంటే యాక్సిడెంట్‌లో దాని వెనుక కాళ్లు రెండు విరిగిపోయినట్లు అనిపిస్తోంది. అలా కదులుతున్న కుక్కను చూసి ఒక వ్యక్తి చాలా బాధపడ్డాడు. అతను తన కారును ఆపి సహాయం చేయడానికి దాని దగ్గరికి వస్తున్నాడు. కానీ అతను ఎదురుగా వచ్చిన వెంటనే కుక్క నాలుగు కాళ్ల పై సులభంగా నడవడం ప్రారంభించింది. దీంతో ఆ వ్యక్తి ఒక్కసారిగా అవాక్కయ్యాడు. ఈ వీడియో @ThebestFigen అనే ఖాతా ద్వారా Xలో భాగస్వామ్యం చేశారు. ఇప్పటి వరకు వేలాది మంది దీనిని చూసి కామెంట్లు చేస్తూ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

Next Story