పూర్తిగా అరుధంతిగా మారిన సాయిపల్లవి.. వైరల్ అవుతున్న ఆ వీడియో!

by Mamatha |
పూర్తిగా అరుధంతిగా మారిన సాయిపల్లవి.. వైరల్ అవుతున్న ఆ వీడియో!
X

దిశ,వెబ్‌డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో నాచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి సుపరిచితమే. ఫిదా మూవీతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ మలయాళ బ్యూటీ మంచి పేరు సంపాదించుకుంది. అంతే కాదు ఈ అందాల ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే ఫ్యాన్స్ ఫాలొయింగ్ సొంతం చేసుకుంది. ఈ బ్యూటీ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంది. అందువల్లే సాయి పల్లవి సెలెక్టెడ్‌గా సినిమాలు చేస్తూ వస్తుంది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకొంది. కానీ ఈ ముద్దుగుమ్మ సింపూల్‌గా ఉండాటానికే ఎక్కువ ఇష్టపడుతుంది.

ఇది ఇలా ఉంటే నిజానికి సాయి పల్లవి హీరోయిన్ కాకముందు తెలుగులో ఢీ షోలో డాన్సర్‌గా పాల్గొన్న సంగతి తెలిసిందే. 2013లో ప్రసారమైన ఈ డాన్స్ కార్యక్రమంలో విన్నర్‌గా నిలిచింది. చేతిలో పొడవైన రెండు ఎరుపు రంగు బట్టలను పట్టుకుని ధం ధం మరణ మృదంగం అనే సాంగ్‌కి అనుష్క చేసే డాన్స్ సినిమా మొత్తంలో హైలెట్గా నిలిచింది. ఇక ఈ పాటకు సాయి పల్లవి సైతం ఢీ కార్యక్రమంలో డాన్స్ చేసింది. ప్రజెంట్ సాయిపల్లవి చేసిన డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ డాన్స్ ఆడియన్స్ ని మిస్మరైజ్ చేస్తుంది. నిజానికి పాటను స్టేజ్ పై పర్ఫార్మ్ చేయడం చాలా కష్టం. కానీ ఎలాంటి ఇబ్బందు లేకుండా తన అద్భుతమైన ప్రదర్శనను కనపరిచింది ఈ బ్యూటీ. ఈమె డాన్స్ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Next Story

Most Viewed