ఎఫ్‌వై25కి పెట్టుబడి వ్యయాన్ని రూ.43 వేల కోట్లకు పెంచిన టాటా మోటార్స్

by Harish |
ఎఫ్‌వై25కి పెట్టుబడి వ్యయాన్ని రూ.43 వేల కోట్లకు పెంచిన టాటా మోటార్స్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ దిగ్గజ ఆటోమొబైల్ తయారీ కంపెనీ టాటా మోటార్స్ కీలక నిర్ణయం తీసుకుంది. 2025 ఆర్థిక సంవత్సరం కోసం తన పెట్టుబడి వ్యయాన్ని రూ.43,000 కోట్లకు పెంచినట్లుగా ప్రకటించింది.ఈ పెట్టుబడిని మొత్తం కూడా బ్రిటీష్ ఆర్మ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ కోసం కేటాయించింది. గతంలో కంపెనీ తన జాగ్వార్ ల్యాండ్ రోవర్(JLR ) మోడల్ ‌కోసం 3 బిలియన్ పౌండ్ల పెట్టుబడి (సుమారు రూ.30,000 కోట్లు), టాటా మోటార్స్‌కు రూ.8,000 కోట్లు - మొత్తం కలిపి రూ.38,000 కోట్ల పెట్టుబడిని పేర్కొంది. అయితే 2024 ఆర్థిక సంవత్సరంలోనే దాదాపు రూ.41,200 కోట్ల పెట్టుబడిని పెట్టడంతో దీనిని వచ్చే ఏడాది మరింత పెంచినట్లు టాటా మోటార్స్ సీనియర్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.

కేవలం ల్యాండ్ రోవర్‌కే ఎఫ్‌వై25లో రూ.35,000 కోట్లను కేటాయించారు. కానీ టాటా మోటార్స్‌కు మాత్రం అదే రూ.8,000 కోట్ల పెట్టుబడిని కొనసాగించనున్నామని అధికారి పేర్కొన్నారు. వినియోగారుల డిమాండ్‌కు అనుకూలంగా JLR మోడల్ కోసం పెట్టుబడులను 6 శాతం పెంచారు. జాగ్వార్ ల్యాండ్ రోవర్ CFO రిచర్డ్ మోలినెక్స్ మాట్లాడుతూ, ఎఫ్‌వై26 మా కొత్త ఉత్పత్తి హిట్‌ను ప్రారంభించే సంవత్సరం. అప్పటికి మార్కెట్‌లో రేంజ్ రోవర్ BEV(బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనం), ఇతర ఉత్పత్తులను కూడా కలిగి ఉంటాము. BEV రేంజ్ రోవర్ మార్కెట్లో టాప్-ఎండ్ అవుతుందని అన్నారు.

Next Story

Most Viewed