వాట్సాప్‌లో డిలీట్ ఫర్ ఆల్‌కు బదులు డిలీట్ ఫర్ మీ అని నొక్కారా?

by Samataha |
వాట్సాప్‌లో డిలీట్ ఫర్ ఆల్‌కు బదులు డిలీట్ ఫర్ మీ అని నొక్కారా?
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం వాట్సాప్ వినియోగిస్తున్న వారి సంఖ్య అధికంగానే ఉంది. ఏమీ లేకుండానైనా ఉండగలుగుతున్నారు కానీ స్మార్ట్ ఫోన్ లేకుండా మాత్రం ఉండలేకపోతున్నారు. మరీ ముఖ్యంగా వాట్సాప్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఇంపార్టెంట్ అయిపోయింది. ఉదయం లేచినదగ్గరి నుంచి రాత్రి పడుకునే వరకు చాలా మంది దాంట్లో చాట్ చేస్తూనే గడుపుతున్నారు. ఇక రోజు రోజుకు వాట్సాప్ యూస్ చేసే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. దీంతో వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని వాట్సాప్ కూడా కొత్త కొత్త ఫీచర్స్ ముందుకొస్తుంది. మరీ ముఖ్యంగా తమ యూజర్స్ ప్రైవసీని కాపాడటానికి న్యూ ఫీచర్స్ తీసుకొస్తుంది. ఈ క్రమంలోనే మరో కొత్త ఫీచర్‌తో వాట్సాప్ మన ముందుకు రానున్నది.

వాట్సాప్‌లో చాట్ చేసేటప్పుడు కొన్ని మెసేజెస్ డిలీట్ చేయడం అనేది చాలా కామన్. కొందరు కొన్ని మెసేజెస్‌ను డిలీట్ ఫర్ ఆల్ నొక్కబోయి, డిలీట్ ఫర్ మీ అని చేస్తుంటారు. దీంతో వారు చాలా బాధపడి పోతారు. ఛీ ఇలా జరిగింది ఏంటీ, ఇంపార్టెంట్ గ్రూప్‌లో పర్సనల్ మెసేజ్ వెళ్లిందని. కాగా, అలాంటి సమస్యలకే చెక్ పెట్టేందుకు వాట్సాప్ కొత్తగా ఆలోచించింది. వాట్సాప్ అన్ డు డిలీట్ ఫర్ మీ అనే కొత్త ఫీచర్ ని తీసుకు వస్తోంది. ఈ కొత్త ఫీచర్ సహాయంతో డిలీట్ చేసిన మెసేజ్ ను మళ్లీ అన్ డు చేసి ఇతరుల ఫోన్లో డిలీట్ చేసే అవకాశాన్ని కల్పిస్తుంది.

ఫీచర్ ద్వారా మనం ఒక మెసేజ్ డిలీట్ చేశామనుకోండి, డిలీట్ ఫర్ మీ క్లిక్ చేయగానే అండ్ డిలీట్ ఫర్ మీ ఆప్షన్ కనబడుతుంది. ఆప్షన్ క్లిక్ చేయగానే డిలీట్ చేసిన మెసేజ్ మళ్లీ రిజిస్టర్ అవుతుంది మళ్లీ డిలీట్ ఫర్ ఎవరీ వన్ మనం ప్రెస్ చేస్తే చాలు. ఐదు సెకండ్ల లోనే ఈ ఆప్షన్ ని ఉపయోగించాలి. కాగా, దీనిని త్వరలో అందుబాటులోకి తీసుకరానున్నారు.

Next Story

Most Viewed