- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేపీ అభ్యర్థి మహదేవప్ప మృతి.. మక్తల్‌లో హై టెన్షన్ వాతావరణం
నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో ఆరో వార్డు బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

దిశ, వెబ్‌డెస్క్: నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో ఆరో వార్డు బీజేపీ (BJP) అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనతో మక్తల్ పట్టణంలో ఒక్కసారిగా హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎన్నికల బరిలో ఉన్న మహదేవప్ప, మంగళవారం తెల్లవారుజామున తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ప్రత్యర్థుల నుంచి ఎదురవుతున్న తీవ్రమైన రాజకీయ ఒత్తిళ్లు, వేధింపుల వల్లే ఆయన ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు మరియు బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.
మక్తల్ ఆసుపత్రి వద్ద భారీ బందోబస్తు..
మహదేవప్ప మృతదేహాన్ని పోస్ట్‌మార్టం (Postmortem) నిమిత్తం మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న వేలాది మంది బీజేపీ కార్యకర్తలు ఆసుపత్రి వద్దకు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు భారీగా మోహరించి బందోబస్తును ఏర్పాటు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కార్యకర్తలు పెద్ద పెట్టున నినాదాలు చేస్తున్నారు. మరోవైపు మహదేవప్ప మృతిపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ నాయకుల బెదిరింపులు, అరాచక రాజకీయాల వల్లే తమ అభ్యర్థి ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. అధికార పార్టీ వేధింపులు తట్టుకోలేకనే మహదేవప్ప బలవన్మరణానికి పాల్పడ్డారని ఆరోపించారు. దీనిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని రాంచందర్ రావు డిమాండ్ చేశారు. మహదేవప్ప కుటుంబానికి న్యాయం జరిగే వరకు బీజేపీ విశ్రమించదని, ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
పోలీసు విచారణ ప్రారంభం..
మహదేవప్ప ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆయన ఫోన్ కాల్ డేటా, సూసైడ్ నోట్ ఏదైనా ఉందా అన్న కోణంలో విచారణ జరుపుతున్నట్లుగా అధికారులు తెలిపారు. పట్టణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సెక్షన్ -163 అమలు చేసేందుకు పోలీసులు ఆలోచిస్తున్నారు.
మున్సిపల్ ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి ఆత్మహత్య
మక్తల్‌లో బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య.. స్పందించిన స్టేట్ చీఫ్ రాంచందర్ రావు
బీజేపీ అభ్యర్థి మృతి.. మక్తల్ మున్సిపాలిటీ ఆరో వార్డు ఎన్నిక రద్దు






