- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మక్తల్‌లో బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య.. స్పందించిన స్టేట్ చీఫ్ రాంచందర్ రావు
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న వేళ నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న వేళ నారాయణపేట జిల్లా మక్తల్ (Maktal) మున్సిపాలిటీ పరిధిలో బీజేపీ (BJP) అభ్యర్థి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. 6వ వార్డు పరిధిలోని చందాపూర్ గ్రామానికి చెందిన మహదేవప్ప (48) బీజేపీ తరఫున కౌన్సిలర్‌గా పోటీ చేస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున ఆయన ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే, మహదేవప్ప ఆత్మహత్యపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు (Ramchander Rao) స్పందించారు. తమ అభ్యర్థి బలవన్మరణానికి పాల్పడటం తీవ్రంగా కలచివేసిందని కామెంట్ చేశారు. ఇది అత్యంత బాధాకరమైన ఘటన అని, మహదేవప్ప కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అన్నారు.
మున్సిపల్ ఎన్నికల వేళ విషాదం.. బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి ఆత్మహత్య






