- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తండ్రి పశువుల కాపరి.. కూతురుకి నీట్ సీటు
ఆర్థిక ఇబ్బందులు, సామాజిక పరిస్థితులు ఎవరైనా సరే లక్ష్యం వైపు అడుగులు వేయకుండా ఆపలేవు అనడానికి ప్రియదర్శిని ఒక గొప్ప ఉదాహరణగా నిలిచింది.

దిశ, వెబ్ డెస్క్ : ఆర్థిక ఇబ్బందులు, సామాజిక పరిస్థితులు ఎవరైనా సరే లక్ష్యం వైపు అడుగులు వేయకుండా ఆపలేవు అనడానికి ప్రియదర్శిని ఒక గొప్ప ఉదాహరణగా నిలిచింది. తమిళనాడులోని ఆలంగుడి జోన్, కీరమంగళం వడక్కు కుమరన్ రోడ్డు ప్రాంతానికి చెందిన తమిళరసన్ ఒక సామాన్య పశువుల కాపరి. తనకున్న స్వల్ప ఆదాయంతోనే భార్య జయంతి, కుమార్తె ప్రియదర్శినితో కలిసి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ఎంతో కష్టపడినా సరే, తన కుమార్తెను ఉన్నత చదువులు చదివించాలనేది ఆయన కోరిక. తండ్రి కష్టాన్ని కళ్లారా చూసిన ప్రియదర్శిని, తన లక్ష్యం డాక్టరు కావడమేనని చిన్నప్పుడే నిర్ణయించుకుంది.
ప్రిదర్శిని తన విద్యాభ్యాసాన్ని అత్యంత నిబద్ధతతో పూర్తి చేసింది. కీరమంగళం బాలికల ప్రభుత్వ మహోన్నత పాఠశాలలో 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకుంది. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నా, తన కలను సాకారం చేసుకోవాలనే పట్టుదలతో నీట్ (NEET) పరీక్షకు సిద్ధమైంది. ఎటువంటి ఖరీదైన కోచింగ్ సెంటర్లు లేకపోయినా, తనదైన శైలిలో కష్టపడి చదివి, తాజాగా వెలువడిన నీట్ ఫలితాల్లో 502 మార్కులు సాధించి ఉత్తీర్ణత సాధించింది.
ఈ విజయంపై ప్రియదర్శిని మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న 7.5 శాతం రిజర్వేషన్ కోటా తనకు ఎంతో ఆసరాగా ఉంటుందని, ఈ కోటా ద్వారా తనకు మెడికల్ సీటు ఖచ్చితంగా వస్తుందనే నమ్మకంతో ఉన్నానని తెలిపింది. ఒక పశువుల కాపరి కుమార్తె తన పట్టుదలతో మెడికల్ సీటును దక్కించుకునే స్థాయికి ఎదగడం పట్ల స్థానికులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రియదర్శిని విజయం, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే ఎంతోమంది విద్యార్థులకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆదర్శంగా నిలిచింది.






