- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్
ఏపీలోని విశాఖపట్నం జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున అత్యంత ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలోని విశాఖపట్నం జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున అత్యంత ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆనందపురం - అనకాపల్లి జాతీయ రహదారిపై గండిగుండం సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. ఒక శుభకార్యానికి వెళ్తుండగా జరిగిన ఈ విపత్తు ఆయా కుటుంబాలలో తీవ్ర విషాదాన్ని నింపింది. పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన సభ్యులు.. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జరగనున్న ఒక శుభకార్యానికి హాజరయ్యేందుకు కారులో బయలుదేరారు. ఆదివారం తెల్లవారుజామున వీరి కారు ఆనందపురం సమీపంలోని గండిగుండం ప్రాంతానికి చేరుకుంది. ఆ సమయంలో కారు ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి రోడ్డుపై వెళ్తున్న లారీని వెనుక నుంచి అతి వేగంగా ఢీకొట్టింది. దీంతో కారు ముందు భాగం లారీ కిందకు దూసుకుపోయి పూర్తిగా నుజ్జునుజ్జయింది.
ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారులో డ్రైవర్‌తో సహా మొత్తం ఐదుగురు ప్రయాణిస్తున్నారు. వీరిలో డ్రైవర్‌తో సహా నలుగురు తీవ్రమైన గాయాల కారణంగా ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద తీవ్రతకు కారు శిథిలాల్లో మృతదేహాలు ఇరుక్కుపోయాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, హైవే పెట్రోలింగ్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారు శిథిలాల నుంచి మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కారులో ఉన్న మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.






