ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా ‘యంగ్ ఇండియా స్కూల్స్’: Deputy CM Bhatti Vikramarka

by Jakkula.Mamatha |   (  Updated:2026-01-22 10:26:58  IST  )

ప్రపంచ విద్యా సంస్థలతో పోటీ పడేలా మన తెలంగాణ నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఉంటాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.

ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా ‘యంగ్ ఇండియా స్కూల్స్’: Deputy CM Bhatti Vikramarka
X

దిశ, ఆసిఫాబాద్: ప్రపంచ విద్యా సంస్థలతో పోటీ పడేలా మన తెలంగాణ నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఉంటాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గురువారం జిల్లా పర్యటనలో భాగంగా జైన్నుర్ మండలంలోని జంగాం గ్రామంలో జిల్లా కలెక్టర్ హరిత, జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, జిల్లా ఎస్పీ నితిక పంత్, ఎమ్మెల్సీ దండే విఠల్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జ, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, మాజీ డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్. నియోజకవర్గ ఇన్చార్జి శ్యాం నాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ మంగలతో కలిసి పర్యటించిన ఆయన ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.

రాష్ట్రంలో పిల్లలకు చదువుకునేందుకు సరైన విద్య వ్యవస్థ లేవని.. సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి ప్రపంచ విద్యాసంస్థలకు పోటీ విధంగా తెలంగాణ రాష్ట్ర యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి 200 కోట్ల వ్యయంతో అన్ని వర్గాల పేద పిల్లలకు చదువుకునే విధంగా సకల సౌభాగ్యాలతో ఈ స్కూల్ నిర్మిస్తున్నట్లు చెప్పారు. అలాగే రాష్ట్రంలో గూడు లేని ప్రతి పేదవాడి సొంతింటి కళ నెరవేరుస్తామని ఎన్నికల వేళ ఇచ్చిన హామీల మేరకు తన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. అర్హత కలిగిన ఆదివాసీ గిరిజనులకు ప్రతి ఒక్కరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇండ్ల ఇస్తామని చెప్పారు. అనంతరం లబ్దిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పత్రాలు అందజేశారు. అంతకుముందు జంగం ఘాట్ హనుమాన్ ఆలయాన్ని దర్శించుకొని డిప్యూటీ సీఎం భట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

READ MORE .....

సింగరేణి బొగ్గు కుంభకోణం వార్తలపై స్పందించిన డిప్యూటీ CM భట్టి

డిప్యూటి సీఎంకి వినతుల వెల్లువ..

Next Story