సింగరేణి బొగ్గు కుంభకోణం వార్తలపై స్పందించిన డిప్యూటీ CM భట్టి

by Gantepaka Srikanth |   (  Updated:2026-01-22 10:33:58  IST  )

సింగరేణిలో భారీ కుంభకోణం జరిగిందంటూ విపక్షాలు ఆరోపణలు చేస్తున్న వేళ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు.

సింగరేణి బొగ్గు కుంభకోణం వార్తలపై స్పందించిన డిప్యూటీ CM భట్టి
X

దిశ, వెబ్‌డెస్క్: సింగరేణిలో భారీ కుంభకోణం(Singareni Coal Scam) జరిగిందంటూ విపక్షాలు ఆరోపణలు చేస్తున్న వేళ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ.. సింగరేణి ప్రజల ఆస్తి అని స్పష్టం చేశారు. సింగరేణి ఆస్తులు దోపిడీకి గురి కాకుండా కాపాడే బాధ్యత తమదే అని అన్నారు. జిల్లాలు ఎత్తివేస్తారనేది తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు. అసలు జిల్లాల ప్రస్తావన.. ఆలోచన రెండూ లేవని అన్నారు. సింగరేణిపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ఈ అంశంపై రేపు పూర్తి వివరాలతో మాట్లాడుతా అని అన్నారు. మరోవైపు సింగరేణిలో కాంగ్రెస్‌ అవినీతి చర్యలకు పాల్పడుతున్నదంటూ బీఆర్‌ఎస్‌ నేతలు ఆందోళనలు చేస్తున్నారు. సింగరేణి సంస్థను కొత్త కొత్త అక్రమాలతో దోచుకునేందుకు కుట్ర పన్నుతున్నారని, ఒరిస్సాలోని నైని బ్లాక్‌ గనులు సైట్‌ విజిటింగ్‌ సర్టిఫికెట్‌ ద్వారా దోచుకునేందుకు ఎత్తులు వేస్తున్నారని, కోల్‌ ఇండియాలో లేని ఈ విధానం సింగరేణిలో ఎందుకంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భట్టి రేపు ఏం మాట్లాడబోతున్నారని ఆసక్తి నెలకొంది.

READ MORE ..... ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా ‘యంగ్ ఇండియా స్కూల్స్’: Deputy CM Bhatti విక్రమార్క

డిప్యూటి సీఎంకి వినతుల వెల్లువ..

నైని బొగ్గు గనుల రద్దుపై కేంద్రం సంచలన నిర్ణయం

Next Story