- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నైని బొగ్గు గనుల రద్దుపై కేంద్రం సంచలన నిర్ణయం
నైని బొగ్గు గనుల రద్దుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర బొగ్గుగనులశాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు నైని బొగ్గు గనుల రద్దుపై విచారణకు కమిటీ వేసింది. కమిటీలో కోల్ డిప్యూటీ డైరెక్టర్ చేత్న శుక్లా, కోల్ డైరెక్టర్ మర్పల్లి వెంకటేశ్వర్లు ఉన్నారు.

దిశ, వెబ్ డెస్క్: నైని బొగ్గు గనుల రద్దుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర బొగ్గుగనులశాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు నైని బొగ్గు గనుల రద్దుపై విచారణకు కమిటీ వేసింది. కమిటీలో కోల్ డిప్యూటీ డైరెక్టర్ చేత్న శుక్లా, కోల్ డైరెక్టర్ మర్పల్లి వెంకటేశ్వర్లు ఉన్నారు. ఈ ఇద్దరు కేంద్ర సభ్యుల బృందం SCCLను సందర్శించనుంది. నైని కోల్ బ్లాక్ టెండర్ రద్దుకు గల కారణాలపై విచారణ జరపనుంది. సింగరేణి నైని కోల్ బ్లాక్ మైన్ డెవలపర్, ఆపరేటర్ నియామకానికి సంబంధించి 28.11.2025న వెలుబడిన టెండర్ ఆహ్వాన నోటీసును విశ్లేషించనుంది. అదే విధంగా తవ్వకాలకు సంబంధించిన ఎండీఓలు మరియు ఔట్ సోర్సింగ్ పనుల కోసం నోటీస్ ఇన్వైటింగ్ టెండర్ తయారీలో ఇతర బొగ్గు కంపెనీలు అనుసరిస్తున్న విధానాలపై అధ్యయనం చేయనుంది. ఈ కమిటీ మూడు రోజుల్లో తన నివేధికను సమర్పించాల్సి ఉంది.






