- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డిప్యూటి సీఎంకి వినతుల వెల్లువ..
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటనలో బాగంగా ఉట్నూర్ కి వచ్చిన విషయం తెలిసిందే.

దిశ, ఉట్నూర్: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటనలో బాగంగా ఉట్నూర్ కి వచ్చిన విషయం తెలిసిందే. ఆయన స్థానిక కేబీ కాంప్లెక్స్ లో విశ్రాంతి తీసుకున్నారు. గురువారం ఆయనను కలిసేందుకు పార్టీ నాయకులు, గిరిజనులు, గిరిజనేతరులు సమస్యలపై వినతి పత్రాలను అందించి విన్నవించారు. కేబీ కాంప్లెక్స్ లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు సోగల ప్రవీణ్ కుమార్, దేవన్న, మల్లికార్జున భట్టి విక్రమార్క కలసి సమస్యలతో కూడిన వినతి పత్రంను అందజేశారు. తనకు 12 నెలలతో కూడిన కన్సాల్డేటెడ్ పే, ఉద్యోగ భద్రత, అధ్యాపకులను రెన్యువల్, ఇతర సమస్యలపై విక్రమార్క దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలపై ఆయన సానుకూలంగా స్పందించారు. అక్కడి నుండి డిప్యూటీ సీఎం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటనకు వెళ్లారు. ఆయన వెంట ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, జీసీసీ చైర్మన్ తిరుపతి కోట్నాక్, జిల్లా అధికారులు, పార్టీ నాయకులు ఉన్నారు.
READ MORE .....
సింగరేణి బొగ్గు కుంభకోణం వార్తలపై స్పందించిన డిప్యూటీ CM భట్టి
ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా ‘యంగ్ ఇండియా స్కూల్స్’: Deputy CM Bhatti Vikramarka






