ఆస్పత్రి బెడ్ పై టీమిండియా క్రికెటర్.. ఫోటో వైరల్

by velandi.Saikiran |   (  Updated:2025-12-17 07:11:15  IST  )

యశస్వి జైస్వాల్ ( Yashasvi Jaiswal)కు ఊహించని పరిణామం ఎదురైంది. తాజాగా ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు

ఆస్పత్రి బెడ్ పై టీమిండియా క్రికెటర్.. ఫోటో వైరల్
X

దిశ‌, వెబ్ డెస్క్ : టీమిండియా స్టార్ ఆటగాడు యశస్వి జైస్వాల్ ( Yashasvi Jaiswal)కు ఊహించని పరిణామం ఎదురైంది. తాజాగా ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు యశస్వి జైస్వాల్. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో భాగంగా ముంబై జట్టు తరఫున ఆడుతున్న యశస్వి జైస్వాల్, తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతున్నారట. నిన్న రాజ‌స్థాన్ తో జ‌రిగిన మ్యాచ్ సంద‌ర్భంగా కడుపు నొప్పి రావ‌డంతో జైస్వాల్ ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. పుణె స‌మీపంలోని ప్రముఖ ఆదిత్య బిర్లా ఆసుపత్రిలో జైస్వాల్ ను అడ్మిట్ చేసింది టీమ్ యాజ‌మాన్యం. అతనికి గ్యాస్ట్రో సమస్య ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో జైస్వాల్ కు ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు వైద్యులు. ఈ మేర‌కు నేష‌న‌ల్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ త‌రుణంలోనే ఆస్పత్రి బెడ్ పైన యశస్వి జైస్వాల్ ఉన్న ఫోటో వైరల్ గా మారింది. ఇది ఇలా ఉండగా నిన్న జరిగిన మ్యాచ్ లో 3 వికెట్ల తేడాతో ముంబై విజయం సాధించింది.

Read More... లోక్‌సభ ముందుకు 'అణుశక్తి నియంత్రణ బిల్లు

భార‌త ఆతిథ్యానికి మెస్సీ ఫిదా.. సోష‌ల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్

Next Story