- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత ఆతిథ్యానికి మెస్సీ ఫిదా.. సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్
గోట్ టూర్ ముగించుకుని ప్రముఖ ఫుట్ బాల్ క్రీడారుడు మెస్సీ స్వదేశానికి బయలుదేరాడు. మూడు రోజుల పాటు మెస్సీ భారత్ లోని కోల్ కతా, ముంబై, హైదరాబాద్, ఢిల్లీ నగరాల్లో పర్యటించి సందడి చేశారు.

దిశ, వెబ్ డెస్క్: గోట్ టూర్ ముగించుకుని ప్రముఖ ఫుట్ బాల్ క్రీడారుడు మెస్సీ స్వదేశానికి బయలుదేరాడు. మూడు రోజుల పాటు మెస్సీ భారత్ లోని కోల్ కతా, ముంబై, హైదరాబాద్, ఢిల్లీ నగరాల్లో పర్యటించి సందడి చేశారు. ఇక పర్యటన ముగియడంతో సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. భారత్ ఆతిథ్యానికి, అభిమానాల ప్రేమకు కృతజ్ఞతలు అని మెస్సీ పేర్కొన్నారు. భారత దేశంలో ఫుట్ బాల్ కు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తున్నానని తెలిపాడు. ఇదిలా ఉంటే మెస్సీ గోట్ టూర్ ఇండియాలో ఎంతో సందడిగా జరిగింది.
కోల్ కతాలో ఏర్పాట్ల విషయంలో కాస్త లోపాలు ఉన్నా తరవాత ఎక్కడా అలాంటివి రిపీట్ అవ్వకుండా ప్రభుత్వాలు, అధికారిక యంత్రాంగం జాగ్రత్త పడింది. మెస్సీ ఆయన టీమ్ భారత పర్యటనను ఎంతగానో ఎంజాయ్ చేసినట్టు కనిపించింది. మఖ్యంగా హైదరాబాద్ పర్యటనలో మెస్సీ, అతడి టీమ్ ఎక్కువ ఆనందంగా గడిపారు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి వారు ఫుట్ బాల్ ఆడారు. అంతేకాకుండా చిన్నపిల్లలతో కూడా కలిసి ఫుట్ బాల్ ఆడుతూ సరదాగా గడిపారు. అభిమానులు మెస్సీని చూసి గ్రౌండ్ లో హంగామా చేశారు.






