టీ20 ప్రపంచకప్‌కు బంగ్లా జట్టు ఎంపిక.. ముస్తాఫిజుర్ రెహ్మాన్‌కు చోటు

by Harish |   (  Updated:2026-01-04 14:44:13  IST  )

టీ20 ప్రపంచకప్‌కు బంగ్లా జట్టు ఎంపిక.. ముస్తాఫిజుర్ రెహ్మాన్‌కు చోటు
X

దిశ, స్పోర్ట్స్ : బంగ్లా బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌పై బీసీసీఐ వేటు వేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. దీన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ) తీవ్రంగా పరిగణిస్తోంది. టీ20 ప్రపంచకప్‌లో భారత్‌లో జరిగే తమ మ్యాచ్‌ను తటస్థ వేదికపై నిర్వహించాలని ఐసీసీని కోరనున్నట్టు తెలుస్తోంది. అయితే వరల్డ్ కప్‌లో పాల్గొనే తమ జట్టును బీసీబీ ఆదివారం ప్రకటించింది. లిటాన్ దాస్ కెప్టెన్సీలో 15 మందితో కూడిన జట్టును వెల్లడించింది. బంగ్లా టీమ్ తమ బౌలింగ్ దళాన్ని నమ్ముకుంది. ముస్తాఫిజుర్ రెహ్మాన్, తస్కిన్ అహ్మద్‌ వంటి పేస్ బౌలర్లకుతోడు మహెది హసన్, నసుమ్ అహ్మద్, రిషద్ హోసన్ వంటి నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. బ్యాటింగ్ సామర్థ్యం కెప్టెన్ లిటాన్ దాస్‌పైనే ఆధారపడి ఉంది. తాంజిద్ మసన్, పర్వేజ్ హుస్సేన్ ఎమాన్‌లు కూడా సత్తాచాటేవారే. లీగ్ దశలో బంగ్లాకు కఠిన డ్రానే ఎదురైంది. ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్లను ఆ టీమ్ ఎదుర్కోవాలి. ఫిబ్రవరి 7న తమ తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌తో తలపడనుంది. ఆ తర్వాత 9న ఇటలీతో, 14న ఇంగ్లాండ్‌తో, 17న నేపాల్‌తో ఆడనుంది.

బంగ్లాదేశ్ జట్టు

లిటాన్ దాస్(కెప్టెన్), తాంజిద్ హసన్, పర్వే్ హుస్సేన్, సైఫ్ హసన్, తౌహిద్ హృదయ్, షమిమ్ హుస్సేన్, క్వాజి నురుల్ హసన్, షాక మహెది హసన్, రిషద్ హుస్సేన్, నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, తాంజిమ్ హసన్ షకీబ్, తస్కిన్ అహ్మద్, షరిఫ్ ఉద్దిన్, షోరిఫుల్ ఇస్లాం.

READ MORE ....

ముస్తాఫిజుర్‌పై బీసీసీఐ వేటు .. సంచలన నిర్ణయం తీసుకున్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు

టీ20 ప్రపంచకప్‌‌లో పాల్గొనడంపై బంగ్లాదేశ్ సంచలన నిర్ణయం.. ఐసీసీకి లేఖ

Next Story