- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Airtel: హాట్‌స్పాట్‌తో 5జీ షేర్ చేస్తే డేటా కట్?
ల్యాప్‌టాప్‌ల కోసం మొబైల్ హాట్‌స్పాట్‌పై ఆధారపడే ఉద్యోగులు, విద్యార్థులు ఈ పరిమితిపై అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా, కొందరు జియోకు మారాలని కూడా ప్రకటిస్తున్నారు.

దిశ, బిజినెస్ బ్యూరో: ఎయిర్‌టెల్ అపరిమిత 5జీ డేటా సేవలపై కొత్త వివాదం చెలరేగింది. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక స్క్రీన్‌షాట్ ప్రకారం, అపరిమిత 5జీ ప్లాన్‌ను యాక్టివేట్ చేసుకున్న వినియోగదారులు మొబైల్ హాట్‌స్పాట్ ద్వారా ఆ డేటాను ఇతర పరికరాలతో పంచుకోలేరని, అలా ఉపయోగిస్తే డేటా 5జీ నుంచి కాకుండా రోజువారీ 4జీ డేటా కోటా నుంచి తగ్గుతుందని పేర్కొంది. ప్రస్తుతం ఎయిర్‌టెల్ అధికారిక నిబంధనల్లో ఈ షరతు కనిపించకపోయినా, ఈ సమాచారం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. ల్యాప్‌టాప్‌ల కోసం మొబైల్ హాట్‌స్పాట్‌పై ఆధారపడే ఉద్యోగులు, విద్యార్థులు ఈ పరిమితిపై అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా, కొందరు జియోకు మారాలని కూడా ప్రకటిస్తున్నారు. టెలికాం నిపుణులు చెబుతున్న దాని ప్రకారం, వినియోగదారులు హాట్‌స్పాట్ ఆన్ చేసినప్పుడు.. టెక్నికల్‌గా నెట్‌వర్క్ స్థాయిలో డేటా సిగ్నల్స్ (టీటీఎల్), ఆపరేటింగ్ సిస్టమ్ ఫింగర్‌ప్రింటింగ్, డీప్ ప్యాకెట్ ఇన్‌స్పెక్షన్ (డీపీఐ) వంటి అధునాతన సాంకేతికతల ద్వారా ఎయిర్‌టెల్ ఏ డివైజ్ కనెక్ట్ అయిందో సులభంగా పసిగట్టగలదని చెబుతున్నారు.
మరోవైపు, కేవలం హాట్‌స్పాట్ పరిమితి మాత్రమే కాకుండా, అపరిమిత 5జీ అని ప్రచారం చేస్తున్నప్పటికీ.. ఎయిర్‌టెల్ నెలకు గరిష్టంగా 300జీబీ డేటా లిమిట్‌ను విధిస్తోందనే అంశంపై కూడా చర్చ జోరుగా సాగుతోంది. ఇదే సమయంలో ఎయిర్‌టెల్ ప్రధాన ప్రత్యర్థి రిలయన్స్ జియో మాత్రం పూర్తిగా భిన్నమైన వ్యూహాన్ని అనుసరిస్తోంది. తమ ట్రూ 5జీ కవరేజీ పరిధిలో ఎలాంటి ఆంక్షలు లేకుండా హాట్‌స్పాట్ ద్వారా కూడా అపరిమిత డేటాను వాడుకోవచ్చని జియో స్పష్టం చేసింది. మరోవైపు వొడాఫోన్ ఐడియా (వీఐ) కూడా హాట్‌స్పాట్‌పై పరిమితులు పెట్టనప్పటికీ, ఎయిర్‌టెల్ లాగే 28 రోజులకు 300జీబీ క్యాపింగ్ ఉంచింది. టెక్నాలజీ కంపెనీలు ఇలాంటి కఠిన నిబంధనలు విధిస్తే, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే కస్టమర్లు జియో వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని, ఇది మార్కెట్ వాటాపై ప్రభావం చూపుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.






