- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీజేపీతో జేపీ నడ్డా చర్చలు అంటూ ప్రకటన.. ఖండించిన నడ్డా
ఢిల్లీలో సీజేపీ పార్లమెంట్ మార్చ్ ఉద్రిక్తత.. జేపీ నడ్డాతో చర్చలకు వెళ్తున్నామన్న సీజేపీ ప్రకటనను తీవ్రంగా ఖండించిన కేంద్ర మంత్రి కార్యాలయం!

దిశ, వెబ్ డెస్క్: సీజేపీ పార్టీ నేతలతో కేంద్ర మంత్రి జేపీ నడ్డా చర్చలకు పిలుపునిచ్చారని ప్రకటనలు పార్లమెంట్ మార్చ్ వేళ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం వేళ దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ పరిసరాలు తీవ్ర రణరంగంగా మారాయి. నీట్ (NEET) పరీక్షల అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్‌తో కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) పిలుపునిచ్చిన "చలో పార్లమెంట్" మార్చ్ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ ఉద్యమానికి మద్దతుగా నిరాహార దీక్ష చేసిన సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌ను పోలీసులు బలవంతంగా సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించడంతో విద్యార్థి లోకం ఆగ్రహంతో ఊగిపోయింది. నిరసనకారులు ఎవరూ పార్లమెంట్ వైపు రాకుండా పోలీసులు న్యూఢిల్లీ జిల్లా పరిధిలో సెక్షన్ 163 (గతంలో సెక్షన్ 144) విధించి, ఆర్ఏఎఫ్, సీఆర్‌పీఎఫ్ బలగాలతో భారీ బారికేడ్లను ఏర్పాటు చేశారు.
చర్చల ప్రకటన.. వెంటనే ఖండించిన జేపీ నడ్డా
ఈ ఉద్రిక్తతల మధ్య సోమవారం మధ్యాహ్నం ఒక ఊహించని రాజకీయ నాటకం చోటుచేసుకుంది. ఉదయం 11:52 గంటల సమయంలో సీజేపీ ప్రధాన ప్రతినిధి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం ఉదయాన్నే తమను చర్చలకు సంప్రదించిందని, తాము కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలవడానికి వెళ్తున్నామని ప్రకటించారు. అయితే, ఈ ప్రకటన వెలువడిన కాసేపటికే కేంద్ర మంత్రి జేపీ నడ్డా కార్యాలయం దీనిని తీవ్రంగా ఖండించింది. సీజేపీతో ప్రభుత్వం ఎలాంటి చర్చలకు పిలవలేదని, ఆ సంస్థతో ఎలాంటి అధికారిక, అనధికారిక భేటీలు ఉండబోవని జేపీ నడ్డా స్పష్టం చేశారు. "సీజేపీతో మేం చర్చలు జరపం" అని ఆయన తేల్చి చెప్పారు. ప్రభుత్వ ముందడుగుపై ఇరు వర్గాల పరస్పర భిన్న ప్రకటనలతో జంతర్ మంతర్ వద్ద నిరసనల భవిష్యత్తుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.






