- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళా ఐపీఎస్‌పై లైంగిక వేధింపులు.. NPA నుంచి ఉదయ కృష్ణారెడ్డి అవుట్
మహిళా ఐపీఎస్‌పై లైంగిక వేధింపుల కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: జాతీయ పోలీసు అకాడమీ (National Police Academy)లో జరిగిన లైంగిక వేధింపుల అంశం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టింస్తోంది. తాజాగా, కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ కృష్ణారెడ్డిపై కర్ణాటక మహిళా ట్రైనీ ఐపీఎస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అత్తాపూర్ పోలీసులు దర్యాప్తును జెట్ స్పీడ్‌లో చెపడుతున్నారు. ఈ మేరకు ఉదయ కృష్ణారెడ్డిని ఉన్నతాధికారులు జాతీయ పోలీసు అకాడమీ నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. తనను గదిలోకి పిలిచి, జుట్టు పట్టుకుని ఈడ్చి నోటికొచ్చినట్లుగా తిడుతూ.. తనపై ఉదయ కృష్ణారెడ్డి దాడికి చేశాడని మహిళా ట్రైనీ ఐపీఎస్ పోలీసులకు స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఈ క్రమంలోనే అత్తాపూర్ పోలీసులు జాతీయ పోలీసు అకాడమీలోని సీసీటీవీ ఫుటేజీలో క్షుణ్ణంగా పరిశీలించి పక్కాాగా ఆధారాలతో విచారణ పూర్తి చేశారు. ట్రైనీ మహిళా ఐపీఎస్, ఉదయ కృష్ణారెడ్డిపై చేసిన ఆరోపణలు అన్నీ నిజమని ప్రివిలేజ్ కమిటీ తేల్చింది. ఈ మేరకు ఉదయ కృష్ణారెడ్డి ఎన్‌పీఏ నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్లుగా అధికారులు ప్రకటించారు.






