- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఊహించని విషాదం.. హోటల్‌లో భోజనం చేస్తూ వ్యక్తి మృతి
by Jakkula.Mamatha |
హోటల్‌లో భోజనం చేస్తుండగా గుండెపోటు రావడంతో ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన గ్రామంలో విషాదం నింపింది.

X
దిశ, మద్నూర్: హోటల్‌లో భోజనం చేస్తుండగా గుండెపోటు రావడంతో ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన గ్రామంలో విషాదం నింపింది. జుక్కల్ మండలం నాగుల్గావ్ గ్రామానికి చెందిన భీంరావు(35) హైదరాబాద్‌లోని పటాన్‌చెరులో కుటుంబంతో కలిసి నివసిస్తూ మేస్త్రి పని చేస్తున్నాడు. ఆదివారం రాత్రి స్వగ్రామానికి వస్తుండగా పెద్దకొడపగల్‌లోని ఓ హోటల్‌లో భోజనం చేసేందుకు కూర్చున్నాడు. అకస్మాత్తుగా కుర్చీలోనే కుప్పకూలిపోయాడు. వెంటనే స్థానికులు అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో 108 సిబ్బంది మార్గమధ్యంలో CPR చేస్తూ బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే భీంరావు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. ఈ సంఘటనతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Next Story






