- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐకాన్ స్టార్ ‘రాకా’ సినిమాలో యంగ్ బ్యూటీ.. నిర్మాత సంచలన ప్రకటనతో భారీ హైప్
త్వరలోనే ‘చెన్నై లవ్ స్టోరీ’ అనే సినిమాతో హీరోయిన్‌గా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్న సిరికి, ఇంత పెద్ద పాన్ ఇండియా సినిమాలో అవకాశం రావడం విశేషం.

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘రాకా’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక వార్త నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే, తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఎస్‌కేఎన్ ఒక కార్యక్రమంలో భాగంగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక క్రేజీ విషయాన్ని వెల్లడించారు. బుల్లితెర షోలు, షార్ట్ ఫిల్మ్స్, ముఖ్యంగా రియాలిటీ షో బిగ్‌బాస్ ద్వారా తెలుగు ప్రేక్షకుల్లో మంచి పాపులారిటీ దక్కించుకున్న నటి సిరి హనుమంతు.. అల్లు అర్జున్ నటిస్తున్న ‘రాకా’ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించే బంపర్ ఛాన్స్ దక్కించుకున్నట్లు ఎస్‌కేఎన్ కన్ఫర్మ్ చేశారు.
త్వరలోనే ‘చెన్నై లవ్ స్టోరీ’ అనే సినిమాతో హీరోయిన్‌గా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్న సిరికి, ఇంత పెద్ద పాన్ ఇండియా సినిమాలో అవకాశం రావడం విశేషం. ఈ న్యూస్ బయటకు రావడంతో నెటిజన్లలో ఈ సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. ఇంత పెద్ద స్టార్స్ ఉన్న సినిమాలో సిరి హనుమంతు ఎలాంటి క్యారెక్టర్‌లో నటిస్తుందో అని నెటిజన్లు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ సినిమా సిరి కెరీర్‌కు ఒక పెద్ద టర్నింగ్ పాయింట్‌గా మారుతుందని, ఆమె రేంజ్ మారిపోతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా, అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ ‘రాకా’ సినిమాలో అల్లు అర్జున్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎక్కడా రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన షెడ్యూల్ ముంబైలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.






