సీఎం విజయ్ చివరి సినిమా.. టికెట్ రేట్లపై కఠిన ఆదేశాలు

by Naga Rani Yarlagadda |

తమిళనాడు సీఎం, దళపతి విజయ్ నటించిన ఆఖరి సినిమా జన నాయగన్ నాలుగురోజుల్లో విడుదలకు రెడీ అవుతోంది.

సీఎం విజయ్ చివరి సినిమా.. టికెట్ రేట్లపై కఠిన ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు సీఎం, దళపతి విజయ్ నటించిన ఆఖరి సినిమా జన నాయగన్ నాలుగురోజుల్లో విడుదలకు రెడీ అవుతోంది. హెచ్. వినోద్ డైరెక్షన్లో.. జూలై 23న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవ్వనుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ ఇవ్వడంతో.. 18 ఏళ్లలోపు వారికి థియేటర్లలోకి ఎంట్రీ ఉండదు. మరోవైపు సినిమా విడుదల సమయంలో ఎలాంటి వివాదాలకు తావులేకుండా.. నిర్మాతలు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఒక్క తమిళనాడులోనే 950 స్క్రీన్లలో ఈ సినిమాను రిలీజ్ చేయనుండగా.. ప్రపంచవ్యాప్తంగా సుమార్ 3000 థియేటర్లలో సినిమా ప్రదర్శితమవ్వనుంది. కాగా.. ప్రభుత్వ నిర్దేశిత ధరల కంటే ఎక్కువ ధరలకు టికెట్లు అమ్మవద్దని థియేటర్ యాజమాన్యాలకు నిర్మాతలు కఠిన ఆదేశాలు జారీ చేశారు. విజయ్ ప్రస్తుతం సీఎం పదవిలో ఉండటంతో.. ఈ సమయంలో అధిక ధరలకు టికెట్లు అమ్మితే.. రాజకీయంగా పెద్ద దుమారం రేగుతుందని, ప్రతిపక్షాలు దీన్ని ఆయుధంగా వాడుకునే ఛాన్సుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు.

Next Story