టీపీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ రాష్ట్ర వైస్ చైర్మన్‌గా నారపోగు వెంకటేశ్వర్లు

by Ratna Kumari |

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఎస్సీ డిపార్ట్‌మెంట్ రాష్ట్ర వైస్ చైర్మన్‌గా ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన నారపోగు వెంకటేశ్వర్లు నియమితులయ్యారు.

టీపీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ రాష్ట్ర వైస్ చైర్మన్‌గా నారపోగు వెంకటేశ్వర్లు
X

దిశ, తల్లాడ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఎస్సీ డిపార్ట్‌మెంట్ రాష్ట్ర వైస్ చైర్మన్‌గా ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన నారపోగు వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. ఈ మేరకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ఎస్సీ డిపార్ట్‌మెంట్ చైర్మన్ రాజేంద్ర పాల్ గౌతమ్ అధికారిక నియామక ఉత్తర్వులు జారీ చేశారు. తన నియామకంపై నారపోగు వెంకటేశ్వర్లు హర్షం వ్యక్తం చేస్తూ పార్టీ అధిష్ఠానానికి, రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యత అప్పగించిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

అలాగే ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, టీపీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ చైర్మన్ కవంపల్లి సత్యనారాయణ, సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయ్‌బాబులకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ సామాజిక వర్గాల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరవేసేందుకు కృషి చేస్తానని, పార్టీ బలోపేతంతో పాటు రానున్న రోజుల్లో కాంగ్రెస్ విజయానికి శాయశక్తులా పనిచేస్తానని పేర్కొన్నారు. నారపోగు వెంకటేశ్వర్లు నియామకంపై సత్తుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గొల్లగూడెం గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

Next Story