సైన్యం దిగితే తప్ప మారరు: వర్మ

by  |
సైన్యం దిగితే తప్ప మారరు: వర్మ
X

రామ్ గోపాల్ వర్మ…. సమాజంలో ఎవరూ స్పందించక పోయినా సరే… తను మాత్రం ప్రతీ విషయంలో స్పందిస్తాడు. కానీ ఎప్పుడూ ఎలా స్పందిస్తాడో మనం అంచనా వేయలేం. అంత కొత్తగా… అంత వెటకారంగా… కొన్నిసార్లు కూల్ గా.. మరికొన్ని సార్లు తమాషాగా… ఇంకొన్ని సార్లు సీరియస్ గా ఉంటుంది. మొన్నటివరకు కరోనా వైరస్ పై జోకులు వేసిన వర్మ…. దాని ప్రభావం ఎక్కువ కావడంతో సీరియస్ గానే స్పందించాడు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించినా… ప్రజలు దాన్ని సీరియస్ గా తీసుకోకుండ రోడ్ల మీద తిరుగుతుండడం పై మండిపడ్డారు. అంటే జనతా కర్ఫ్యూ రోజు మీరు ఇచ్చిన సంఘీభావం వన్ డే ఇంటర్నేషనల్ మాచ్ లాంటిదా అని ప్రశ్నించారు. ఇలాంటి వాళ్లకు బుద్ధి చెప్పాలంటే సైన్యాన్ని దింపాల్సిందే అన్నాడు వర్మ. ఆదివారం సాయంత్రం 5 గంటలకు డాక్టర్లు, పోలీసులు, మీడియాకు తమ చప్పట్లతో అభినందించిన వారు.. ఉదయం 5 గంటలకు మరిచిపోయారని… ఇదేనా ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే విధానం అని ప్రశ్నించారు.

ఇక ఇంగ్లీష్ భాషలో సోషల్ డిస్టన్సింగ్ అనే పదం నేను ఇంతకు ముందు వినలేదని… కానీ ఇప్పుడు అదే పదం ఎక్కువ యూజ్ చేయాల్సి వస్తుందని అన్నాడు వర్మ.

Tags: RGV, Varma, Corona Effect, CoronaVirus, Covid 19

Next Story

Most Viewed