‘క్లైమాక్స్‌’‌కు అనూహ్య స్పందన.. సర్వర్ క్రాష్

by  |
‘క్లైమాక్స్‌’‌కు  అనూహ్య స్పందన.. సర్వర్ క్రాష్
X

హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా కాంటెంపరరీ అంశాలతో సినిమాలు తీస్తుంటారు రామ్‌ గోపాల్‌ వర్మ. తన గత చిత్రాలు ఎంత ఘోరంగా విఫలమైనా.. నెక్స్ట్ సినిమాకు హైప్ తీసుకురావడంతో ఆయనకు ఆయనే సాటి. తాజాగా లాక్‌డౌన్‌లోనూ సినిమాలు తీసి.. తన వర్కింగ్ స్టైల్‌తో మెస్మరైజ్ చేశారు. లాక్‌డౌన్‌‌లో మియా మాల్కోవా అనే పోర్న్ స్టార్‌తో ఆర్జీవీ తీసిన చిత్రం..‘క్లెమాక్స్‌’. ఈ సినిమా ట్రైలర్లతోనే యూత్‌లో హీట్ ఎక్కించింది. గతంలో మాల్కోవాతో తీసిన ‘జీఎస్టీ’ సినిమాతో వర్మ సంచలనాలు సృష్టించగా, ఇప్పుడు అదే కాంబినేషన్‌లో క్లైమాక్స్‌తో రాబోతుండటం..వర్మ ఫ్యాన్స్‌కు సినిమాపై అంచానాలు పెరిగేలా చేసింది. ఇటీవలే ‘సినిమా ఆన్‌లైన్‌ బుకింగ్స్‌ ఓపెన్‌’ అంటూ వర్మ ట్విట్టర్‌లోనూ ప్రచారం చేసిన విషయం తెలిసిందే. రూ.100 పెట్టి సినిమా చూడాలని పోస్టర్ రిలీజ్ చేసిన వర్మ.. అన్నట్లుగానే జూన్ 6న, శనివారం రాత్రి 9గంటలకు సినిమాను RGVWorld.in/shreyasET ఆన్‌లైన్ వేదికగా విడుదల చేశారు. నెటిజన్లు ఓ రేంజ్‌లో బుకింగ్స్ చేసుకోగా.. అనుకున్న దానికంటే ఎక్కువమందే ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపించారు. దీంతో సర్వర్ ఓవర్ లోడ్ కావడంతో క్రాష్ అయ్యింది. ఈ నేపథ్యంలో వర్మ.. తాను అనుకున్నట్లే సినిమా సక్సెస్ అయ్యిందని తన దైన స్టైల్‌లో స్పందించారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రిపోర్టు గ్రాఫ్ షేర్ చేశారు వర్మ. ‘క్లైమాక్స్ అప్పుడే క్లైమాక్స్‌కు చేరిపోయింది. 50 వేల మంది లైవ్ స్ట్రీమ్‌లో చూస్తారని ఎక్స్‌పెక్ట్ చేశాం. కానీ అంతకుమించి అంచనాలు పెరిగిపోయాయి. ఓవర్ లోడ్ కావడంతో సర్వర్ క్రాష్ అయ్యింది. వెంటనే కెపాసిటీ పెంచడంతో.. సినిమా చూసే వారి సంఖ్య పెరిగింది. మిషన్ అకంప్లిష్డ్’ అని ట్వీట్ చేశారు. వర్మ లెక్కల ప్రకారం శనివారం రాత్రే ‘క్లైమాక్స్’ సినిమాను లక్షకు పైగా మంది చూశారు. అయితే.. సర్వర్ డౌన్ కావడంతో నెటిజన్లు వర్మపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లైవ్ స్ర్టీమ్ ఓపెన్ కావడం లేదని, డబ్బులు కట్టాక కూడా వెయిట్ చేయడమేంటని, వర్మ ఫెయిల్ అయ్యారంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేశారు.

Next Story

Most Viewed