- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భద్రతా బలగాల అపూర్వ విజయం.. ఆపరేషన్ సిందూర్‌లో వాడిన ఆయుధాలివే!
పాకిస్థాన్ (Pakistan), పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK)లోని ఇండియన్ ఆర్మీ మొత్తం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఆకస్మిక వైమానిక దాడులు చేపట్టింది.

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్థాన్ (Pakistan), పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK)లోని ఇండియన్ ఆర్మీ మొత్తం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఆకస్మిక వైమానిక దాడులు చేపట్టింది. ఈ మేరకు త్రివిధ దళాలు చేసిన దాడులకు సంబంధించి పాకిస్థాన్ సోషల్ మీడియా (Social Media)లో వైరల్ అవుతున్న విజువల్స్‌ను కేంద్ర ప్రభుత్వం (Central Government) షేర్ చేసింది. అయితే, ఆ వీడియోలో అర్ధరాత్రి రోడ్లపై గుమిగూడారు. అనంతరం వారికి అత్యంత సమీపంలో ఒక విజిల్ సౌండ్‌తో మిసైల్ పడి భారీ ఎత్తున బ్లాస్ట్ అవ్వడం కనిపించింది. ఆ పేలుడు ధాటికి అక్కడున్న ప్రజలంతా అరబిక్‌లో ప్రార్థనలు చేయడం, భయాందోళనలతో అరవడం ఆ వీడియోలో రికార్డ్ అయింది.
ఇండియన్ ఆర్మీ వాడిన ఆయుధాలివే..
బహవల్పూర్ (Bahawalpur) కేంద్రంగా జైష్-ఎ-మహమ్మద్, మురిద్కే కేంద్రంగా ఉన్న లష్కర్-ఎ-తొయిబా స్థావరాలపై జరిపిన దాడుల్లో భారత్ చాలా రకాల బాంబులను ప్రయోగించింది. అందులో బంకర్లను విధ్వంసం చేసేవి, గాలిలో ప్రయోగించే PSCLP మిసైల్ కూడా ఉంది. అదేవిధంగా స్టాండ్ ఆఫ్ స్మార్ట్ బాంబు, లోటరింగ్ మందుగుండు సామగ్రి, డ్రోన్-బోర్న్ క్షిపణులు కూడా వాడారు.
ఉగ్రశిబిరాలను ధ్వంసం చేసింది ఇవే.. వీటి పేర్లు ఏంటో తెలుసా?
జైష్-ఎ-మహ్మద్ ఉగ్రవాద సంస్థ మాస్టర్ మైండ్ మసూద్ అజహర్ చరిత్ర ఏంటి..?






