Operation Sindoor: ఉగ్రశిబిరాలను ధ్వంసం చేసింది ఇవే.. వీటి పేర్లు ఏంటో తెలుసా?

by Vemula.Srinu Prasad |

పాకిస్థాన్ ఆక్రమిత ప్రాంతంలోని ఉగ్రవాద శిబిరాలను భారత్ సైన్యం ధ్వంసం చేస్తోంది..

Operation Sindoor: ఉగ్రశిబిరాలను ధ్వంసం చేసింది ఇవే.. వీటి పేర్లు ఏంటో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: ఆపరేషన్ సిందూర్‌‌(Operation Sindoor)లో భాగంగా పాక్ ఆక్రమిత ప్రాంతం జమ్మూకాశ్మీర్‌(Jammu and Kashmir)లో ఉగ్రవాదుల శిబిరాలపై భారత్ సైన్యం విరుచుకుపడింది. SCALP క్రూయిజ్ క్షిపణి, HAMMER ప్రెసిషన్ బాంబు, లాటరింగ్ మునిషన్స్‌తో దాడులు చేసి ఉగ్రశిబిరాలను ధ్వంసం చేస్తోంది. సుదూర ప్రాంతాలను కచ్చితమైన టార్గెట్‌తో ఉగ్రశిబిరాలను పేల్చివేసేందుకు ఈ మందు గుండు సామాగ్రిని భారత సైన్యం వినియోగించింది.

అయితే భారత సైన్యం ప్రయోగించిన మూడు ప్రయోగాల్లో మొదటిది స్కాల్ప్‌. దీనిని స్మార్ట్ షాడో అని అంటారు. 250 కిలో మీటర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను అత్యంత వేగంగా చేరుకునేందుకు ఈ క్రూయిజ్ క్షిపణిని వినియోగిస్తారు. అతి తక్కువ ఎత్తులో, రాడార్లకు సైతం ఈ క్షిపణి సామర్థ్యం తెలియకుండా ప్రయాణిస్తుంది. టార్గెట్‌ను ధ్వంసం చేయడానికే ఈ క్షిపణిని ప్రయోగిస్తారు. అయితే స్పాల్ప్ ను ఒకసారి మాత్రమే ఉపయోగిస్తారు. గాల్లో ఉండి గస్తీ కాసేందుకు పని చేయదు. వార్ హెడ్ క్షిపణితో అతుక్కుపోయి ఉంటుంది. విడదీయడానికి కుదరదు.

రెండోది: హామర్ బాంబు దాడి: హామర్ అంటే హైలీ అజైల్ మాడ్యులర్ మునిషన్ ఎక్స్‌టెండెడ్ రేంజ్. ఇది స్మార్ట్ బాంబు. ఉగ్రవాదులు ఉపయోగించే రీన్ఫోర్స్డ్ బంకర్లు, బహుళ అంతస్తులు, గట్టి భవనాలను ఢీకొట్టడానికి ఉపయోగించారు. ప్రయోగ ఎత్తును బట్టి 50-70 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఢీకొట్టగలదు.

మూడోది: లాటరింగ్ మునిషన్స్: దీనిని కామికేజ్ డ్రోన్స్ అని కూడా పిలుస్తారు. దాడుల చేయాల్సిన ప్రాంతాలు, ఉగ్రశిబిరాలను ఈ డ్రోన్స్ ద్వారా దాడి చేస్తారు. ఆయా ప్రాంతాల్లో తిరుగుతూ లక్ష్యాలను గుర్తిస్తాయి. రిమోట్ కంట్రోల్ ద్వారా ముప్పులను తొలగిస్తారు.

ప్రస్తుతం ప్రయోగాల ద్వారా ఆపరేషన్ సిందూర్‌ను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే తొమ్మిది ఉగ్రవాదుల శిబిరాలపై భారత సైన్యం దాడి చేసింది. ఇందులో నాలుగు పాకిస్తాన్ ప్రధాన భూభాగం కాగా.. ఐదు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. నిషేధిత ఉగ్రవాద గ్రూపులకు సంబంధించిన శిబిరాలను గుర్తించి బుధవారం తెల్లవారు జాము నుంచి భారత సైన్యం దాడులు చేస్తోంది.

Next Story