ఆ తేదీన ఓటీటీలోకి 'నాగబంధం'.. ఎప్పుడు.. ఎక్కడో.. తెలుసా?

by Pulgam srinivas |

'నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్' మూవీ జూలై 24 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

ఆ తేదీన ఓటీటీలోకి నాగబంధం.. ఎప్పుడు.. ఎక్కడో.. తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: విరాట్ కర్ణ హీరోగా, నభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం 'నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్'. ఈ చిత్రానికి అభిషేక్ నామ దర్శకత్వం వహించారు. జూలై 3న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. ఇక థియేటర్లలో విడుదలైన నెల రోజులు కూడా పూర్తికాకముందే ఈ సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదలైంది.

ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఇందులో భాగంగా జూలై 24 నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది. థియేటర్లలో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయిన ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ చిత్రంలో అనసూయ, జగపతి బాబు, మురళీ శర్మ, దక్ష నాగర్కర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. జునైద్ కుమార్, అభే సంగీతం అందించగా, నిక్ స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్లపై కిషోర్ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.

Next Story