- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేంద్ర విద్యాశాఖలో భారీ మార్పులు.. కొత్త కార్యదర్శిగా నరేష్ పాల్ గంగ్వార్
కేంద్ర విద్యాశాఖలో బ్యూరోక్రేటిక్ ప్రక్షాళన మొదలైంది.

దిశ, వెబ్‌డెస్క్: నీట్ (NEET) పరీక్షల లీకేజీ వివాదం, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వినీత్ జోషి (Vineet Joshi) స్థానంలో నరేష్ పాల్ గంగ్వార్ (Naresh Pal Gangwar)ను నూతన కార్యదర్శిగా నియమిస్తూ అర్థరాత్రి దాటాక అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. 1994 బ్యాచ్, రాజస్థాన్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి నరేష్ పాల్ గంగ్వార్ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు. తాజా ఉత్తర్వులతో ఆయన ఉన్నత విద్యాశాఖ శాఖ సెక్రటరీగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. అదేవిధంగా ఆ స్థానంలో ఉన్న ప్రస్తుత కార్యదర్శి వినీత్ జోషిని పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా బదిలీ చేశారు. అదేవిధంగా పాఠశాల విద్యా, అక్షరాస్యత శాఖకు కొత్త బాస్‌గా 1995 కర్ణాటక బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి టీకే అనిల్ కుమార్‌ను నియమించారు. పరీక్షా వ్యవస్థల పారదర్శకతపై తీవ్ర ఒత్తిడి నెలకొన్న తరుణంలో అధికారుల బదిలీలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.






