విద్యార్థులను దేశ శత్రువులా చూస్తున్నారు: మోడీ ప్రభుత్వంపై సోనియా గాంధీ తీవ్ర ధ్వజం

by Malleboina Mahesh |   (  Updated:2026-07-24 04:21:04  IST  )

విద్యార్థుల నిరసనలను మోడీ ప్రభుత్వం 'దేశ శత్రువుల చర్యలుగా' చిత్రీకరిస్తోందని, వారి భవిష్యత్తును కాపాడడం రాజ్యాంగ బాధ్యత అని సోనియా గాంధీ వ్యాఖ్య.

విద్యార్థులను దేశ శత్రువులా చూస్తున్నారు: మోడీ ప్రభుత్వంపై సోనియా గాంధీ తీవ్ర ధ్వజం
X

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా నీట్ (NEET) పేపర్ లీక్ అక్రమాలకు వ్యతిరేకంగా విద్యా సంస్కరణలు, ప్రభుత్వ జవాబుదారీతనం కోరుతూ ఆందోళన బాట పట్టిన విద్యార్థుల పట్ల కేంద్ర ప్రభుత్వం అత్యంత దారుణంగా ప్రవర్తిస్తోందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (CPP) అధినేత్రి సోనియా గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రముఖ ఆంగ్ల పత్రికకు రాసిన ప్రత్యేక వ్యాసంలో ఆమె కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అందులో "న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతున్న దేశ యువత ధైర్యానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం పిరికిపంద చర్యలు, తీవ్రమైన క్రూరత్వం తో సమాధానమిస్తోంది.

విద్యార్థులను దేశ భవిష్యత్తును నిర్మించే వారసులుగా కాకుండా 'దేశ శత్రువులు'గా పరిగణిస్తూ వేధింపులకు గురిచేస్తోంది. మోడీ ప్రభుత్వం దేశ విద్యా రంగాన్ని తీవ్రంగా దిగజార్చడమే కాకుండా.. బాధ్యతారాహిత్యం, స్వయం మోహం, పరమ నిర్లక్ష్యంతో వ్యవహరించడాన్ని ఒక అలవాటుగా మార్చుకుంది. ఇలాంటి క్లిష్ట సమయంలో విద్యార్థులకు అండగా నిలబడి వారి భవిష్యత్తును కాపాడటం మనందరి నైతిక, రాజకీయ, రాజ్యాంగబద్ధమైన ప్రాథమిక బాధ్యత" అని సోనియా గాంధీ స్పష్టం చేశారు.

Next Story