గంజాయి ముఠాపై ఎక్సైజ్ పోలీసుల మెరుపు దాడి.. ఒకరి అరెస్టు

by Jakkula.Mamatha |

గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముఠా పై ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి వారి నుంచి ఒక కిలో పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్న ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది

గంజాయి ముఠాపై ఎక్సైజ్ పోలీసుల మెరుపు దాడి.. ఒకరి అరెస్టు
X

దిశ, ఇబ్రహీంపట్నం: గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముఠా పై ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి వారి నుంచి ఒక కిలో పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్న ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని సీతారాం పేట సమీపంలో గురువారం రాత్రి అక్రమంగా గంజాయిని తరలిస్తున్నారని పక్కా సమాచారం మేరకు ఇబ్రహీంపట్నం ఎక్సైజ్ ఎస్సై బషీర్ ఆధ్వర్యంలో గంజాయి ముఠాపై దాడి చేసి వారి నుంచి సుమారు ఒక కిలోకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కాగా గంజాయి ముఠాకు చెందిన ఒకరిని అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. ఈ దాడుల్లో స్వాధీనం చేసుకున్న గంజాయిని ఇబ్రహీంపట్నం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story