- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'జన నాయగన్' కోసం విజయ్‌కు భారీ పారితోషకం.. ఎంతంటే?
'జన నాయగన్' కోసం విజయ్ రూ.220 కోట్ల నుంచి రూ.275 కోట్ల వరకు పారితోషకం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

దిశ, వెబ్ డెస్క్: కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు ప్రస్తుత ముఖ్యమంత్రి దళపతి విజయ్ తాజాగా 'జన నాయగన్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా, మమిత బైజు కీలక పాత్రలో కనిపించింది. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను కెవిఎన్ ప్రొడక్షన్స్ సంస్థ దాదాపు రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించింది. నిన్న భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద నెగిటివ్ టాక్ వచ్చింది.
అయితే ఈ సినిమా కోసం విజయ్ భారీ స్థాయిలో పారితోషకం అందుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం 'జన నాయగన్' కోసం విజయ్ రూ.220 కోట్ల నుంచి రూ.275 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే తన చివరి సినిమా అని విజయ్ ఇప్పటికే ప్రకటించడంతో ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి పూర్తి థియేట్రికల్ రన్ ముగిసే సమయానికి 'జన నాయగన్' ఎంత మేర వసూళ్లు సాధించి, ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.






