- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'ఓమ్ ' ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్?
ధనుష్ నటిస్తున్న 'ఓమ్ - ఛాప్టర్ 1: ఉదిరమ్' ఫస్ట్ సింగిల్‌ను జూలై 28న విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: కోలీవుడ్ నటుడు ధనుష్ ప్రస్తుతం 'అమరన్' ఫేమ్ రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఓమ్ - ఛాప్టర్ 1: ఉదిరమ్' చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను ఈ ఏడాది అక్టోబర్ 16న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేస్తోంది. ఇదిలా ఉండగా, ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం, జూలై 28న ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొద్ది రోజుల్లో వెలువడే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల, నసీరుద్దీన్ షా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తుండగా, ఆర్‌టేక్ స్టూడియోస్, వండర్‌బార్ ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.






