- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వదలని వరదలు ఆరుగురు మృతితో 47 కి చేరిన మృతుల సంఖ్య
అస్సాంలో కొనసాగుతున్న వరద ఉధృతి: మరో ఆరుగురు బలి, 47కి చేరిన మరణాల సంఖ్య, 7.21 లక్షల మందిపై తీవ్ర ప్రభావం.

దిశ, వెబ్ డెస్క్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అతి భారీ వర్షాల (Heavy rains) కారణంగా.. అస్సాం రాష్ట్రంలో వరద (flood) పరిస్థితులు అత్యంత భయాందోళన కరంగా కొనసాగుతున్నాయి. రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (ASDMA) విడుదల చేసిన తాజా హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో వరదల ధాటికి మరో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో తాజా వరదల వల్ల మరణించిన వారి మొత్తం సంఖ్య 47కి చేరింది.
అలాగే ఈ భారీ వరదల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 11 జిల్లాల్లో 7.21 లక్షల మందికి పైగా ప్రజలు ఈ వరద ప్రభావానికి గురయ్యారు. శివసాగర్ జిల్లాలో అత్యధికంగా 3.75 లక్షల మంది బాధితులు కాగా, చరాయిదేవ్‌లో 1.86 లక్షలు, జోర్‌హాట్‌లో 1.15 లక్షల మంది వరద నీటిలో చిక్కుకున్నారు. బ్రహ్మపుత్ర సహా పలు ప్రధాన నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో వందలాది గ్రామాలు, వేలాది హెక్టార్ల పంట పొలాలు నీటమునిగాయి. వరద బాధితుల కోసం అధికారులు వందలాది పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు ముమ్మరం చేశాయి.






