డీఎంఆర్‌సీ కీలక నిర్ణయం.. 17 ప్రముఖ మెట్రో స్టేషన్లు మూసివేత!

by Kema Shiva Kumar |

ఇవాళ ఉదయం ఉదయం 7:30 నుంచి 17 ప్రధాన మెట్రో స్టేషన్లను డీఎంఆర్‌సీ మూసివేసింది.

డీఎంఆర్‌సీ కీలక నిర్ణయం.. 17 ప్రముఖ మెట్రో స్టేషన్లు మూసివేత!
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) ప్రయాణికులకు కీలక ప్రకటన చేసింది. ఇవాళ ఉదయం 7:30 నుంచి 17 ప్రధాన మెట్రో స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్‌లను మూసివేస్తున్నట్లుగా ప్రకటించింది. అయితే, ప్రయాణికులు రైళ్లు మారేందుకు వీలుగా రాజీవ్ చౌక్, మండీ హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్లలో ఇంటర్‌చేంజ్ సౌకర్యం అందుబాటులోనే ఉంటుందని డీఎంఆర్‌సీ స్పష్టం చేసింది. సెంట్రల్ ఢిల్లీ పరిధిలోని 17 కీలక స్టేషన్ల వద్ద ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లు ఉదయం 7:30 నుంచి మూసివేయబడ్డాయి. అదేవిధంగా పటేల్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్, సేవా తీర్థ్ మెట్రో స్టేషన్ గేట్లు ఇప్పటికే మూసివేసి ఉన్నాయి. ప్రధాన స్టేషన్ల వద్ద గేట్లు క్లోజ్ చేయడంతో ప్రయాణికులు తమ ప్రయాణ సమయాన్ని తగిన విధంగా ప్రణాళిక చేసుకోవాలని డీఎంఆర్‌సీ కోరింది.

Next Story