- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎల్‌బీనగర్–సాగర్ రింగ్‌రోడ్ పరిధిలో ప్రజల ప్రాణాలతో చెలగాటం
ఎల్‌బీనగర్–సాగర్ రింగ్‌రోడ్ పరిధిలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి.

దిశ, హస్తినాపురం : ఎల్‌బీనగర్–సాగర్ రింగ్‌రోడ్ పరిధిలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు నెల రోజులుగా నాగార్జునసాగర్ జాతీయ రహదారి మూసివేత, మరోవైపు నోరు తెరిచి ఉన్న ప్రమాదకరమైన మ్యాన్‌హోల్, ఇంకోవైపు ప్రత్యామ్నాయ మార్గం లేక భారీ ట్రాఫిక్ జామ్‌లు.. ఈ మూడు సమస్యలతో వేలాది మంది వాహనదారులు, స్థానిక ప్రజలు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. అధికారులు, పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ సమస్యకు శాశ్వత పరిష్కారం లేక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాగర్ రింగ్‌రోడ్ సమీపంలోని పోచ మ్మ–పెద్దమ్మ ఆలయం వద్ద వర్షపు నీటి ప్రవాహాన్ని నియంత్రించేందుకు భారీ స్టార్మ్ వాటర్ డ్రెయిన్ పైప్‌లైన్ ప నులు కొనసాగుతున్నాయి.
ఈ పనుల కారణంగా నాగార్జునసాగర్ జాతీయ రహదారిని గత నెల రోజులుగా మూ సివేయడంతో మొత్తం ట్రాఫిక్‌ను పోచ మ్మ–పెద్దమ్మ ఆలయం నుంచి ఎల్‌బీనగర్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం వర కు ఉన్న ఒక్క ప్రత్యామ్నాయ రహదారిపైనే మళ్లించారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ మార్గం పూర్తిగా వాహనాలతో నిండిపోతుండడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్‌లు ఏ ర్పడుతున్నాయి. అత్యవసర సేవల వాహనాలు సైతం ట్రాఫిక్‌లో చిక్కుకుపోతున్న పరిస్థితి నెలకొంది.
శాశ్వత పరిష్కారం ఎప్పుడు?
ఈ సమస్యలన్నింటిపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన మ్యా న్‌హోల్‌కు వెంటనే ఇనుప మూత ఏ ర్పాటు చేయాలని, పైప్‌లైన్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి జాతీ య రహదారిని తిరిగి తెరవాలని డిమాండ్ చేస్తున్నారు.
మ్యాన్‌హోల్ నోరు తెరిచి.. ప్రమాదానికి ఆహ్వానం
ఈ ట్రాఫిక్ సమస్యకు తోడు ఎల్‌బీనగర్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలో ఐదు రోజులుగా మ్యాన్ హోల్ మూత పూర్తిగా విరిగి నోరు తెరిచి ఉండడం ప్రజలను మరింత భయాందోళనకు గురిచేస్తోంది. అధికారులు తాత్కాలికంగా సిమెంట్ మూతలను ఏర్పాటు చేస్తున్నప్పటికీ భారీ వాహనాల రాకపోకల కారణంగా అవి మళ్ళీ విరిగిపోతున్నాయి. వ ర్షం పడినప్పుడు డ్రైనేజీ నీరు పొం గిపొర్లి మ్యాన్‌హోల్ పూర్తిగా కనిపించకుండా పోవడంతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా శాశ్వతంగా బలమైన ఇనుప మూత ఏర్పాటు చేసి ప్రమాదాల ను నివారించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఒక్కటే ప్రత్యామ్నాయ మార్గం ఉండడంతో ట్రాఫిక్ నియంత్రణ పోలీసులకు పెద్ద సవాల్ గా మారింది. మరోవైపు పనులు ని ర్వహిస్తున్న కాంట్రాక్టర్లు విజయ్ రెడ్డి, జగదీశ్‌రెడ్డి తమ ఇబ్బందులను వివరించారు.






