- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరోసారి ట్రంప్ పన్నుల బాదుడు
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ సహా దాదాపు 60 దేశాల ఉత్పత్తులపై మరొకసారి భారీగా పన్నుల వేటు వేశారు.

దిశ, వెబ్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ సహా దాదాపు 60 దేశాల ఉత్పత్తులపై మరొకసారి భారీగా పన్నుల వేటు వేశారు. ఈ దేశాల నుండి అమెరికాకు ఎగుమతయ్యే సరుకులపై 10 శాతం నుండి 12.5 శాతం వరకు సుంకాలను (Tariffs) విధిస్తున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. ఈ నూతన పన్నులు నేటి నుంచే తక్షణమే అమల్లోకి వస్తాయని అమెరికా స్పష్టం చేసింది. కార్మికులతో వెట్టిచాకిరీ (Forced Labor) చేయించి తయారు చేసే ఉత్పత్తులను అడ్డుకోవడంలో, వారిపై తగిన చర్యలు తీసుకోవడంలో ఆయా దేశాలు విఫలమయ్యాయనే నెపంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మానవ హక్కులను కాలరాస్తూ తయారు చేసే ఉత్పత్తులకు అమెరికా విపణిలో చోటు లేదని తెగేసి చెబుతూ ట్రంప్ ఈ పన్నుల బాదుడును ప్రారంభించారు.
అమెరికా విధించిన ఈ సవరించిన పన్నుల భారంతో బాధింపబడే దేశాల జాబితాలో భారతదేశంతో పాటు చైనా, యూరోపియన్ యూనియన్, బ్రిటన్ (UK), జపాన్, దక్షిణ కొరియా, పాకిస్తాన్, శ్రీలంక మరియు బంగ్లాదేశ్ వంటి ప్రధాన ఆర్థిక వ్యవస్థలు ఉన్నాయి. ఈ నూతన సుంకాల విధానం వల్ల భారతదేశం నుండి అమెరికాకు వెళ్లే వివిధ ఉత్పత్తులపై 10 శాతం అదనపు పన్ను భారం పడనుంది. ఇప్పటికే అంతర్జాతీయ వాణిజ్య అడ్డంకులతో సతమతమవుతున్న వేళ, అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం భారత ఎగుమతిదారులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.






