- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండియన్ ఆర్మీకి ధన్యవాదాలు : చైనా
భారత్‌లో చైనా నూతన డిఫెన్స్ అటాచ్‌గా బాధ్యతలు చేపట్టిన అడ్మిరల్ యూ జియాన్ భారత నౌకాదళం (Indian Navy) అందించిన సేవలను స్మరించుకుంటూ కృతజ్ఞతలు తెలిపారు.

దిశ, వెబ్ డెస్క్ : భారత్‌లో చైనా నూతన డిఫెన్స్ అటాచ్‌గా బాధ్యతలు చేపట్టిన అడ్మిరల్ యూ జియాన్ భారత నౌకాదళం (Indian Navy) అందించిన సేవలను స్మరించుకుంటూ కృతజ్ఞతలు తెలిపారు. చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) 99వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది కేరళ తీరానికి సమీపంలో ఘోర అగ్నిప్రమాదానికి గురైన ఒక చైనా కార్గో షిప్‌లోని 12 మంది చైనీస్ నావికులను భారత నావికాదళం అత్యంత ప్రాణాలకు తెగించి రక్షించిన ఘట్టాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రత్యేకంగా గుర్తుచేసుకున్నారు. భారత నేవీ ప్రదర్శించిన సమయానుకూల ప్రతిస్పందనను, మానవతా దృక్పథాన్ని తామెప్పటికీ మరిచిపోలేమని, దానికి తాము ఎంతో రుణపడి ఉంటామని కొనియాడారు. సముద్ర భద్రతతో పాటు ఇరు దేశాల మధ్య శాంతియుత వాతావరణం నెలకొల్పడంలో ఈ రకమైన సహకారం ఎంతో కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో కూడా మిలిటరీ, దౌత్యపరమైన అంశాల్లో భారతదేశంతో కలసి పనిచేసేందుకు చైనా ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని అడ్మిరల్ యూ జియాన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.






