ముగిసిన కేంద్ర కేబినెట్ భేటీ.. గుడబెళ్లూరు-మహబూబ్‌నగర్ 4 లేన్ హైవే నిర్మాణానికి రూ.3,175 కోట్లు మంజూరు

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-14 08:24:54  IST  )

ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) పేరును 'సేవతీర్థ్'గా మారుస్తూ ఆమోదముద్ర వేశారు.

ముగిసిన కేంద్ర కేబినెట్ భేటీ.. గుడబెళ్లూరు-మహబూబ్‌నగర్ 4 లేన్ హైవే నిర్మాణానికి రూ.3,175 కోట్లు మంజూరు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, అశ్విని వైష్ణవ్, తదితరులు పాల్గొన్నారు. ఇవాళ్టి కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముందుగా ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) పేరును ‘సేవతీర్థ్’గా మార్చాలని నిర్ణయించారు. దేశ రాజధాని ఢిల్లీ-అంబాలా మధ్య రెండు కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి ఆమోద ముద్ర వేశారు. అదేవిధంగా గుడబెళ్లూరు-మహబూబ్‌నగర్ 4 లైన్ల హైవే నిర్మాణానికి రూ.3,175 కోట్ల నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మొత్తంగా రూ. 1.60 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేబినెట్ భేటీలో ఆమోదం తెలిపారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీలకు భారీ శుభవార్త.. ఏపీ బడ్జెట్‌లో వరాల జల్లు

Next Story