- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆలస్యమవుతున్న ప్రభుత్వ ఏర్పాటు.. ఇదే అదునుగా తమిళనాడు కాంగ్రెస్ సంచలన నిర్ణయం
తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు విషయంలో నెలకొన్న అనిశ్చితిపై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది.

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు విషయంలో నెలకొన్న అనిశ్చితిపై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి, మెజారిటీ పార్టీలు (TVK-కాంగ్రెస్ కూటమి) స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నప్పటికీ, గవర్నర్ ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. తమిళనాడులో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా గవర్నర్ తీరు ఉందని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. అత్యధిక సీట్లు సాధించిన పక్షాన్ని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించకుండా కాలయాపన చేయడం వెనుక రాజకీయ కుట్ర ఉందని వారు విమర్శించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఒక పార్టీకి కొమ్ముకాయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్రం ఒత్తిడితోనే నిర్ణయాలు?..
ఈ మొత్తం వ్యవహారం వెనుక ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల ఒత్తిడి ఉందని కాంగ్రెస్ సంచలన ఆరోపణలు చేసింది. "బీజేపీ ఆడుతున్న రాజకీయ క్రీడలో గవర్నర్ ఒక పావుగా మారారు" అని కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా, వెనుకబాటు తలుపుల ద్వారా అధికారాన్ని శాసించాలని చూడటం ప్రజలను అవమానించడమేనని సీరియస్ అయ్యారు. గవర్నర్ వైఖరికి నిరసనగా రేపు (శుక్రవారం) తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా భారీ ఆందోళనలు చేపట్టనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించి, ప్రజాస్వామ్య పరిరక్షణకు పోరాడతామని పిలుపునిచ్చింది. తమిళనాడులో రాజకీయ సెగలు పుట్టిస్తున్న ఈ పరిణామాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. గవర్నర్ తదుపరి అడుగు ఎలా ఉంటుందోనని రాజకీయ వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.
ఆటో డ్రైవర్ కాదు కోటీశ్వరుడు.. టీవీకే ఎమ్మెల్యే బండారం బట్టబయలు






