- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆటో డ్రైవర్ కాదు కోటీశ్వరుడు.. టీవీకే ఎమ్మెల్యే బండారం బట్టబయలు
తమిళనాడు ఎన్నికల్లో టీవీకే తరపున సామాన్యులను బరిలో దింపి విజయ్ గెలిచాడని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తన కారు డ్రైవర్ కుమారుడికి టికెట్ ఇచ్చి గెలిపించడం, ఓ డ్రైవర్ కు టికెట్ ఇచ్చి గెలిపించడం వార్తల్లో హాట్ టాపిక్ గా మారాయి.

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు ఎన్నికల్లో టీవీకే తరపున సామాన్యులను బరిలో దింపి విజయ్ గెలిచాడని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తన కారు డ్రైవర్ కుమారుడికి టికెట్ ఇచ్చి గెలిపించడం, ఓ డ్రైవర్ కు టికెట్ ఇచ్చి గెలిపించడం వార్తల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఓ ఆటో డ్రైవర్ కు టికెట్ ఇచ్చి గెలిపించాడంటూ దేశవ్యాప్తంగా వార్తలు మారుమోగాయి. అయితే తాజాగా ఓ ఆసక్తికర విషయం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆటో డ్రైవర్ అని ప్రచారం చేసిన టీవీకే అభ్యర్థి పి. శరవణన్ అసలు డ్రైవర్ కాదని అతడు థార్, టోయోటా లాంటి కార్లకు యజమాని అని తెలుస్తోంది.
ఆయన కోటీశ్వరుడు కానీ అది చెప్పుకుండా తమిళనాడు ప్రజలను ఆటో డ్రైవర్ అంటూ మోసం చేశారని డీఎంకే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది. ఒకప్పుడు శరవణన్ ఆటో డ్రైవర్‌గా పనిచేశాడని చెబుతున్నారని, కానీ అతడి ఎన్నికల నామినేషన్ పత్రంలో ఆటో లేకుండా కార్లు ఉన్నాయని ట్రోల్స్ చేస్తోంది. అతడి దగ్గర ఉన్న వాహనాల ఖరిదే 22 లక్షలకు పైగా ఉంటుందని, కానీ ఆటో డ్రైవర్ అంటూ విజయ్ పీఆర్ స్టంట్స్ తో తమిళనాడును మోసం చేశాడని మండిపడుతున్నారు. మరోవైపు గెలిచిన తరవాత ఓ టీవీకే ఎమ్మెల్యే రోడ్డుపై మందు కొడుతూ చిల్ అవుతున్న వీడియోలు నెట్టింట వైరల్ అయితే మరో ఎమ్మెల్యే తల్వార్ తో కేక్ కటింగ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






