- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొల్లేరు కాలుష్యంపై సుప్రీంకోర్టు కమిటీ విచారణ.. ప్రభుత్వానికి కీలక ఆదేశాలు
కొల్లేరు సరస్సులో కాలుష్యం రోజురోజుకూ పెరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సరస్సు పరిరక్షణపై సుప్రీంకోర్టు నియమించిన కేంద్ర సాధికార కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది...

దిశ, వెబ్ డెస్క్: కొల్లేరు సరస్సులో కాలుష్యం రోజురోజుకూ పెరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సరస్సు పరిరక్షణపై సుప్రీంకోర్టు నియమించిన కేంద్ర సాధికార కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కేసు విచారణ సందర్భంగా కొల్లేరులోని అక్రమ చేపల చెరువులను తొలగించే చర్యలు చేపట్టాలని సూచించింది. అలాగే అటవీశాఖకు పూర్తిగా సహకారం అందించాలని ఏలూరు జిల్లా కలెక్టర్‌ను కమిటీ ఆదేశించింది. కూల్చివేతల ప్రక్రియలో స్థానిక యంత్రాంగం సహకరించడం లేదని, కొందరు అడ్డంకులు సృష్టిస్తున్నారనే ఫిర్యాదులపై తక్షణమే సమీక్ష జరిపాలని సూచించింది. అలాగే చర్యలు సైతం చేపట్టాలని కమిటీ స్పష్టం చేసింది.
మరోవైపు కొల్లేరు సరస్సులో పెరుగుతున్న కాలుష్యం వల్ల వలస, స్థానిక పక్షుల మనుగడ ప్రమాదంలో పడుతోందని పిటిషనర్ వ్యక్తం చేసిన ఆందోళనపై కమిటీ స్పందించింది. సరస్సు కాలుష్యంపై సమగ్ర వివరాలు సమర్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అక్రమ చేపల చెరువులకు విద్యుత్ కనెక్షన్లు ఎలా మంజూరు చేశారనే అంశంపై కమిటీ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అక్రమ చెరువుల కూల్చివేతల పురోగతి, కాలుష్య నియంత్రణకు తీసుకుంటున్న జాగ్రత్తలు, అలాగే సరస్సు పర్యావరణాన్ని కాపాడటానికి అమలు చేస్తున్న కార్యాచరణపై పూర్తి నివేదికను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర సాధికార కమిటీ ఆదేశాలు జారీ చేసింది.






